Guntur: తొలగించిన ఓటర్లపై ఇంటింటి సర్వే అధికారులకు కలెక్టర్ ఆదేశాలు!
Guntur: గుంటూరు జిల్లాలో తొలగించిన ఓటర్ల వివరాలపై ఇంటింటి సర్వే మరియు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని అధికారులను ఆదేశించిన కలెక్టర్ సి.యం.సాయికాంత్ వర్మ.
Guntur: తొలగించిన ఓటర్లపై ఇంటింటి సర్వే అధికారులకు కలెక్టర్ ఆదేశాలు!
Guntur: అర్హులైన ప్రతి ఓటరును ఓటర్ల జాబితాలో నమోదు చేయుటకు మూడు రోజులపాటు ప్రత్యేక డ్రైవ్ ను నిర్వహించాలని తెలిపారు. ఈ డ్రైవ్ లో భాగంగా, బూత్ స్థాయి అధికారులు ఇంటింటికీ వెళ్లి, తమ పరిధిలోని పోలింగ్ స్టేషన్లకు సంబంధించి తొలగించిన పేర్ల జాబితాలను తీసుకువెళ్లి ఆయా ఓటర్ల స్థితిని పునః ధ్రువీకరించాలని ఆదేశించారు. ఎవరి పేరైనా పొరపాటున తొలగించినట్లు గుర్తిస్తే, ఆ ఓటరుతో ఫారం- 6 పూరించడానికి అవకాశం కల్పించాలని ఆదేశించారు.
తగిన ధృవీకరణ పూర్తయిన తర్వాత, నిరంతర నవీకరణ ప్రక్రియ కింద వారి పేరును తిరిగి ఓటర్ల జాబితాలో చేర్చాలని స్పష్టం చేశారు. ఈ మేరకు సంబంధిత అధికారులతో గురువారం టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. గురువారం, శుక్రవారం, శనివారం మూడు రోజులపాటు ఈ ప్రత్యేక డ్రైవ్ ను నిర్వహించాలని ఆదేశించారు. అర్హులైన ప్రతి ఓటరును ఓటర్ల జాబితాలో నమోదు చేయాలని మరియు జాబితాలో ఏ ఒక్క అనర్హుడూ ఉండకూడదని" భారత ఎన్నికల సంఘం స్పష్టం చేసిందన్నారు. తొలగించిన ఓటర్ల వివరాలు సర్వే,
కొత్తగా చేరవలసిన ఓటర్ల నమోదుకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని ఎన్నికల సంఘం సంఘం నిర్ణయించిందని వివరించారు. "అర్హులైన ప్రతి ఓటరు పేరును ఓటర్ల జాబితాలో చేర్చడం, అనర్హుల పేర్లను తొలగించడం" అనే ఈసీఐ లక్ష్యానికి అనుగుణంగా ప్రస్తుత డ్రైవ్ ఉద్దేశించడం జరిగిందని చెప్పారు.
2026 ప్రత్యేక సమగ్ర సవరణలో భాగంగా, 2026 జూన్ 15 నుండి జూలై 24 వరకు బూత్ స్థాయి అధికారులు ఇంటింటి సర్వే నిర్వహించారన్నారు. మరణం, శాశ్వత నివాస మార్పు, బహుళ నమోదులు, చిరునామాలో లేకపోవడం లేదా ఇతర కారణాల వల్ల ఓటర్లు వారు ఇచ్చిన చిరునామాలలో లేరని ఈ సర్వేలో బూత్ స్థాయి అధికారులు గుర్తించిన విషయం విదితమేనని అన్నారు. ఇంటింటి సర్వే ఆధారంగా మరణించిన, స్థలం మారిన, బహుళ నమోదులు కలిగిన ఓటర్ల పేర్లను తొలగించిన తర్వాత, 2026 జూలై 31న ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రచురించడం జరిగిందని తెలిపారు.
ముసాయిదా జాబితా ప్రచురణ తర్వాత నోటీసు దశలో, 2026 అక్టోబర్ 6 నాటికి ప్రచురించబోయే తుది ఓటర్ల జాబితాలో చేర్చడానికి వీల్లేని ఓటర్లను అనర్హులుగా గుర్తిండం జరిగిందన్నారు. రాష్ట్రంలో 2026 ప్రత్యేక సమగ్ర సవరణ కింద 2026 అక్టోబరు 16వ తేదీన తుది ఓటర్ల జాబితాను ప్రచురించడం జరుగుతుందని తెలిపారు. ఓటర్ల నమోదుకు జనవరి 1, ఏప్రిల్ 1, జులై, అక్టోబర్ అనే నాలుగు అర్హత తేదీలు అందుబాటులో ఉన్నాయన్నారు.
రాబోయే సంవత్సరం జనవరి 1వ తేదీని అర్హత తేదీగా పరిగణించి వార్షిక సంక్షిప్త సవరణను నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు. 2026 అక్టోబరు 16వ తేదీన ప్రచురించే తుది జాబితాలో పేరు లేని వారు, పొరపాటున వదిలివేయబడినవారు లేదా తదుపరి అర్హత తేదీల నాటికి అర్హత పొందే ఏ వ్యక్తి అయినా సరే నిరంతర నవీకరణ ప్రక్రియలో భాగంగా తమ పేరు నమోదు కోసం ఫారం-6 ను సమర్పించవచ్చని వివరించారు.




