Guntur: అంబేద్కర్ భవన్ నిర్మాణ పనులను పరిశీలించిన కలెక్టర్ సాయి కాంత్ వర్మ
Guntur: గుంటూరు నగరంలో అసంపూర్తిగా ఉన్న అంబేద్కర్ భవన్ నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ సి.ఎం. సాయి కాంత్ వర్మ గురువారం ఆకస్మికంగా పరిశీలించారు.
Guntur: అంబేద్కర్ భవన్ నిర్మాణ పనులను పరిశీలించిన కలెక్టర్ సాయి కాంత్ వర్మ
గుంటూరు: గుంటూరు నగరంలో అసంపూర్తిగా ఉన్న అంబేద్కర్ భవన్ నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ సి యం.సాయి కాంత్ వర్మ గురువారం పరిశీలించారు.
రెండంతస్తుల భవనం మొత్తాన్ని కలియతిరిగి పరిశీలించిన కలెక్టర్, భవన నిర్మాణ ప్రస్తుత పరిస్థితిని క్షుణ్ణంగా పరిశీలించారు. భవనంలోని వివిధ విభాగాలు, నిర్మాణ పనుల పురోగతి, ఇంకా చేపట్టాల్సిన పనులను పరిశీలించి సంబంధిత అధికారులతో వివరాలు అడిగి తెలుసుకున్నారు.
అంబేద్కర్ భవనాన్ని పూర్తి స్థాయిలో వినియోగంలోకి తీసుకువచ్చే విధంగా అవసరమైన చర్యలపై అధికారులతో చర్చించారు.
అనంతరం అంబేద్కర్ భవనం పక్కనే ఉన్న బుద్ధశ్రీ ఆర్కియాలజికల్ మ్యూజియంను జిల్లా కలెక్టర్ ఆసక్తిగా తిలకించారు. మ్యూజియంలోని చారిత్రక, పురావస్తు ప్రాధాన్యత కలిగిన అంశాలను పరిశీలించి, వాటి వివరాలను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు.
ఈ కార్యక్రమం లో కలెక్టర్ వెంట ఆర్డీవో శ్రీనివాసరావు, ఏపీఈడబ్ల్యూఐడీసీ ఈఈ అనిల్ కుమార్, జిల్లా గిరిజన సంక్షేమ అధికారి దుర్గాబాయి, తహసీల్దార్ కిరణ్, నిర్వాహకులు మేడిద బాబూరావు తదితరులు ఉన్నారు.




