Phirangipuram: ఫిరంగిపురం ఈవీఎం గోడౌన్ను పరిశీలించిన జిల్లా కలెక్టర్ సాయికాంత్ వర్మ!
Phirangipuram: ఫిరంగిపురంలో ఈవీఎం గోడౌన్ను తనిఖీ చేసిన గుంటూరు జిల్లా కలెక్టర్ సి.యం.సాయికాంత్ వర్మ. సీసీ కెమెరాలు, భద్రతా ఏర్పాట్లపై అధికారులకు కీలక సూచనలు.
Phirangipuram: ఫిరంగిపురం ఈవీఎం గోడౌన్ను పరిశీలించిన జిల్లా కలెక్టర్ సాయికాంత్ వర్మ!
Phirangipuram: ఫిరంగిపురంలో ఇ.వి.ఎం గోడౌన్ ను జిల్లా కలెక్టర్ సి.యం.సాయికాంత్ వర్మ ఆదివారం తనిఖీ చేశారు. ఇ.వి.ఎంలు భద్రపరిచిన గదుల వద్ద భద్రతా చర్యలు, సీసీ కెమెరాల పనితీరు, గోడౌన్ తాళాలు, సీల్లను పరిశీలించారు. ఇ.వి.ఎంల భద్రత విషయంలో ఎన్నికల సంఘం మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించాలని సంబంధిత అధికారులకు సూచించారు. గోడౌన్ పరిసరాల్లో నిరంతర పర్యవేక్షణ ఉండాలని, భద్రతా ఏర్పాట్లలో ఎలాంటి లోపాలు లేకుండా చూడాలని సూచించారు. రికార్డులను ఎప్పటికప్పుడు సక్రమంగా నిర్వహించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో తహసిల్దార్, తదితరులు పాల్గొన్నారు.




