Guntur: ఈవీఎం గోడౌన్‌ను నిశితంగా తనిఖీ చేసిన కలెక్టర్ సాయికాంత్ వర్మ!

Guntur: గుంటూరు ఈవీఎం గోడౌన్‌ను జిల్లా కలెక్టర్ సాయికాంత్ వర్మ తనిఖీ చేశారు. భద్రతా ఏర్పాట్లు, సీసీ కెమెరాల పనితీరు, రికార్డులను స్వయంగా పరిశీలించారు.

B RAJENDRA, GUNTUR TOWN
Published on: 25 Oct 2026 12:03 AM IST
Guntur
X

Guntur: ఈవీఎం గోడౌన్‌ను నిశితంగా తనిఖీ చేసిన కలెక్టర్ సాయికాంత్ వర్మ!

గుంటూరు: జిల్లా కేంద్రంలోని ఇ.వి.ఎం గోడౌన్ ను జిల్లా కలెక్టర్ సి.యం.సాయికాంత్ వర్మ శనివారం తనిఖీ చేశారు. ఇ.వి.ఎంలు భద్రపరిచిన గదుల వద్ద భద్రతా చర్యలు, సీసీ కెమెరాల పనితీరు, గోడౌన్ తాళాలు, సీల్‌లను పరిశీలించారు.

ఇ.వి.ఎంల భద్రత విషయంలో ఎన్నికల సంఘం మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించాలని సంబంధిత అధికారులకు సూచించారు. గోడౌన్ పరిసరాల్లో నిరంతర పర్యవేక్షణ ఉండాలని, భద్రతా ఏర్పాట్లలో ఎలాంటి లోపాలు లేకుండా చూడాలని సూచించారు. రికార్డులను ఎప్పటికప్పుడు సక్రమంగా నిర్వహించాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎన్ ఎస్ కె.ఖాజావలి, రెవిన్యూ డివిజనల్ అధికారి కె.శ్రీనివాస రావు, జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి లోచర్ల రమేష్, జిల్లా విపత్తులు, అగ్నిమాపక శాఖ అధికారి ఎం.శ్రీనివాసరెడ్డి, సహాయ జిల్లా విపత్తులు, అగ్నిమాపక శాఖ అధికారి కె. కృష్ణా రెడ్డి, రహదారులు భవనాలు శాఖ డిఇ హజరతయ్య, జిల్లా కలెక్టర్ కార్యాలయ పరిపాలన అధికారి మల్లేశ్వరి, తహసిల్దార్ కిరణ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.

B RAJENDRA, GUNTUR TOWN

B RAJENDRA, GUNTUR TOWN