Guntur: వీల్ చైర్‌లో వచ్చిన దివ్యాంగుడి వద్దకు వెళ్లి అర్జీ తీసుకున్న కలెక్టర్ సాయి కాంత్ వర్మ!
Guntur: గుంటూరు జిల్లా కలెక్టరేట్‌లో మానవీయ ఘటన. నడవలేని స్థితిలో వీల్ చైర్‌పై వచ్చిన ఎనమదల గ్రామానికి చెందిన దివ్యాంగుడు శివనాగరాజు వద్దకు స్వయంగా వెళ్లి సమస్య తెలుసుకున్న కలెక్టర్ సాయి కాంత్ వర్మ.
Guntur: వీల్ చైర్‌లో వచ్చిన దివ్యాంగుడి వద్దకు వెళ్లి అర్జీ తీసుకున్న కలెక్టర్ సాయి కాంత్ వర్మ!
గుంటూరు: ప్రతిపాడు నియోజకవర్గ పరిధిలోని ఎనమదల గ్రామానికి చెందిన శివనాగరాజు అనే వ్యక్తి గుంటూరు జిల్లా కలెక్టరేట్ కార్యక్రమానికి ఆటోలో నడవలేని స్థితిలో వీల్ చైర్ లో రావడంతో, విషయం తెలుసుకున్న గుంటూరు జిల్లా కలెక్టర్ సాయి కాంత్ వర్మ స్వయంగా అతని వద్దకు వచ్చి అతని సమస్యను అడిగి తెలుసుకున్నారు.
పత్తిపాడు మండల సర్వేయర్, తన పొలం కు సంబంధించిన పొలం సర్వే సర్టిఫికెట్ కోసం ఎన్నోసార్లు తిరిగినా కానీ తన సమస్య పరిష్కారం ఆవ్వటం లేదంటూ బాధితుడు కలెక్టర్ తో వాపోయాడు.
Next Story




