Guntur: ఏసీ కాలేజీ డిస్ట్రిబ్యూషన్ సెంటర్, మహిళా కళాశాలలో శిక్షణా తరగతుల పరిశీలన!

Guntur: గుంటూరు ఏసీ కాలేజీ డిస్ట్రిబ్యూషన్ సెంటర్, మహిళా కళాశాల శిక్షణా తరగతులను కలెక్టర్ సాయికాంత్ వర్మ పరిశీలించారు.

B RAJENDRA, GUNTUR TOWN
Published on: 18 Oct 2026 8:06 AM IST
Guntur
X

Guntur: ఏసీ కాలేజీ డిస్ట్రిబ్యూషన్ సెంటర్, మహిళా కళాశాలలో శిక్షణా తరగతుల పరిశీలన!

Guntur: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా పోలింగ్ సిబ్బంది పూర్తి స్థాయిలో శిక్షణ పొందాలని జిల్లా కలెక్టర్ సి యం. సాయికాంత్ వర్మ సూచించారు. శనివారం గుంటూరు నగరంలోని ఏసీ కాలేజీలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్‌ను జిల్లా కలెక్టర్ పరిశీలించి, సిబ్బందికి పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. అనంతరం ప్రభుత్వ మహిళా కళాశాలలో జరుగుతున్న పోలింగ్ సిబ్బంది శిక్షణా తరగతులను పరిశీలించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, పోలింగ్ విధులకు సంబంధించి సిబ్బంది తమ సందేహాలను శిక్షణ సమయంలోనే నివృత్తి చేసుకోవాలని సూచించారు. సంబంధిత ఎన్నికల మెటీరియల్‌ను క్షుణ్ణంగా చదివి, పూర్తిగా అర్థం చేసుకున్న తర్వాతే విధులు నిర్వహించాలని తెలిపారు. ఎన్నికల ప్రక్రియలో ఎలాంటి అశ్రద్ధకు తావులేకుండా, నిబంధనలను పాటిస్తూ బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ వెంట గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ మయూర్ అశోక్, ఇతర అధికారులు ఉన్నారు.

B RAJENDRA, GUNTUR TOWN

B RAJENDRA, GUNTUR TOWN