Guntur: గుంటూరులో ఈవీఎం గోడౌన్‌ను తనిఖీ చేసిన కలెక్టర్ సాయికాంత్ వర్మ!

Guntur: గుంటూరులో ఈవీఎం గోడౌన్‌ను జిల్లా కలెక్టర్ ఎస్.ఎం.సాయికాంత్ వర్మ తనిఖీ చేసి, భద్రతా చర్యలు, సీసీ కెమెరాల పనితీరును పరిశీలించారు.

B RAJENDRA, GUNTUR TOWN
Published on: 25 Sept 2026 12:08 PM IST
Guntur
X

Guntur: గుంటూరులో ఈవీఎం గోడౌన్‌ను తనిఖీ చేసిన కలెక్టర్ సాయికాంత్ వర్మ!

Guntur: జిల్లా కేంద్రంలోని ఇ.వి.ఎం గోడౌన్ ను జిల్లా కలెక్టర్ సి.యం.సాయికాంత్ వర్మ శుక్రవారం తనిఖీ చేశారు. ఇ.వి.ఎంలు భద్రపరిచిన గదుల వద్ద భద్రతా చర్యలు, సీసీ కెమెరాల పనితీరు, గోడౌన్ తాళాలు, సీల్‌లను పరిశీలించారు. ఇ.వి.ఎంల భద్రత విషయంలో ఎన్నికల సంఘం మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించాలని సంబంధిత అధికారులకు సూచించారు.

గోడౌన్ పరిసరాల్లో నిరంతర పర్యవేక్షణ ఉండాలని, భద్రతా ఏర్పాట్లలో ఎలాంటి లోపాలు లేకుండా చూడాలని సూచించారు. రికార్డులను ఎప్పటికప్పుడు సక్రమంగా నిర్వహించాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎన్ ఎస్ కె.ఖాజావలి, గృహ నిర్మాణ సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ జె.వి.ఎస్.ఆర్.కె.ప్రసాద్, జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి లోచర్ల రమేష్, తహసిల్దార్ కిరణ్ కుమార్, రాజకీయ పార్టీల ప్రతినిధులు ఎన్.ఓంకార్, డా.టి.సేవ కుమార్, వై పిచ్చి రెడ్డి, తదితరులు పాల్గొన్నారు...

B RAJENDRA, GUNTUR TOWN

B RAJENDRA, GUNTUR TOWN