Guntur: పోలింగ్ స్టేషన్లను సంయుక్తంగా తనిఖీ చేయాలి
Guntur: గుంటూరు నగరంలో స్థానిక సంస్థల ఎన్నికల ఏర్పాట్లపై కమిషనర్ మయూర్ అశోక్ సమీక్ష. పోలింగ్ కేంద్రాల ఉమ్మడి తనిఖీలు, మెరుగైన వసతులపై కీలక ఆదేశాలు.
Guntur: పోలింగ్ స్టేషన్లను సంయుక్తంగా తనిఖీ చేయాలి
గుంటూరు: గుంటూరు నగరంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు జోనల్ అధికారులు, ఇంజనీరింగ్ అధికారులు, రిటర్నింగ్ అధికారులు అందరు సంయుక్తంగా పోలింగ్ స్టేషన్లను తనిఖీ చేసి నివిదికలను అందజేయాలని అడిషనల్ ఎలక్షన్ అథారిటీ, నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ జోనల్ అధికారులను మరియు ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు.
శనివారం నగర పాలక సంస్థలోని కాన్ఫరెన్స్ హాల్ నందు జోనల్ అధికారులు మరియు ఇంజనీరింగ్ అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి తీసుకోవాల్సిన చర్యల పై అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, నగరంలో ఉన్న అన్ని పోలింగ్ స్టేషన్లను జోనల్ అధికారులు, ఇంజనీరింగ్ అధికారులు మరియు రిటర్నింగ్ అధికారులు సంయుక్తంగా పర్యటించి పూర్తి నివేదికను అందజేయాలని అధికారులను ఆదేశించారు. పోలింగ్ స్టేషన్లలో కరెంట్, త్రాగు నీరు ఉండేలా చూడాలని, పోలింగ్ స్టాఫ్ నైట్ పోలింగ్ స్టేషన్ లోనే ఉంటారు కాబట్టి బాత్ రూమ్స్ శుభ్రంగా ఉండేలా చూడాలని చూడాలన్నారు.
31వ తారీఖు మెటీరియల్ డిస్ట్రిబ్యూషన్ పూర్తైన అనంతరం జిల్లా కలెక్టర్ వారు నిర్దేశిత మెనూ ప్రకారం నైట్ డిన్నర్ మరియు 1వ తారీఖు పోలింగ్ రోజు మార్నింగ్ టిఫిన్, మధ్యాహ్నం లంచ్ మరియు స్నాక్స్ వంటివి సమయానికి నాణ్యమైన ఆహారం అందజేయాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా బ్రేక్ ఫాస్ట్ ఉదయం 6 గంటలకు అందేలా ప్రణాలికలు సిద్దం చేసుకోవాలన్నారు.
పోలింగ్ స్టాఫ్ కు భోజన సదుపాయాలు అందజేయటానికి ఇంజనీరింగ్ అధికారులు ముందుగానే ఏర్పాట్లు చేసుకోవాలని, ఏర్పాట్లలో ఎటువంటి పిర్యాదులు రాకుండా చర్యలు తీసుకోవాలని ఇంజనీరింగ్ ఏదికారులను ఆదేశించారు. పోలింగ్ స్టేషన్ల వద్ద ఓటర్లకు త్రాగు నీరు, టెంట్లు, బ్యారికేడ్లు ఏర్పాటు చేయాలని, ముఖ్యంగా వికలాంగులు పోలింగ్ స్టేషన్ లోకి వెళ్ళుటకు వీల్ చైర్స్ వంటివి ఏర్పాటు చేసుకోవాలన్నారు.
ఎన్నికల నిర్వహణకు ప్రతి పోలింగ్ స్టేషన్ కు ఒక ఇంచార్జ్ ను ఏర్పాటు చేయుట జరిగిందని, కావున వారి సహాయం కూడా తీసుకోవాలన్నారు. సెన్సిటివ్ పోలింగ్ స్టేషన్ల వద్ద పోలీస్ అధికారులతో కో ఆర్డినేషన్ తో పని చేయాలని, అలాగే వారి సూచన మేరకు బ్యారికేడులు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. అధికారులు అందరు కలిసి ఈ ఎన్నికలను సమర్ధవంతంగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని, ఈ ఎన్నికల నిర్వహణకు సంబంధించి నగర పాలక సంస్థలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసుకోవాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు.
సమావేశం నందు యస్.ఈ జి. వెంకటేశ్వర రావు, డిసిపి సూరజ్ కుమార్, యంహెచ్ఓ డాక్టర్ సురేష్, ఈ.ఈ లు విష్ణు, వేణు, సుందర్రామి రెడ్డి, జోనల్ ఆఫీసర్స్, డి.ఈ.ఈలు, ఏ.ఈలు, ఎలక్షన్ సెల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.




