Guntur: బస్సు ప్రమాదాలపై కాంగ్రెస్ నేత అందే దిలీప్ తీవ్ర విమర్శలు

Guntur: ట్రావెల్ యాజమాన్యాల నిబంధనల ఉల్లంఘనే బస్సు ప్రమాదాలకు కారణమని, కోదాడ ప్రమాద బాధితులను ప్రభుత్వాలు ఆదుకోవాలని కాంగ్రెస్ నేత అందే దిలీప్ డిమాండ్ చేశారు.

SHAREEF, PONNURU
Published on: 27 Aug 2026 10:19 PM IST
Guntur
X

Guntur: బస్సు ప్రమాదాలపై కాంగ్రెస్ నేత అందే దిలీప్ తీవ్ర విమర్శలు

గుంటూరు: ట్రావెల్ యాజమాన్యాలు కాసుల కక్రుత్తితో చేస్తున్న నిబంధనల ఉల్లంఘనే బస్సు ప్రమాదాల్లో అమాయకులను బలిచేస్తుందని గుంటూరు జిల్లా పొన్నూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అందే దిలీప్ అన్నారు.

కోదాడ వద్ద జరిగిన బస్సు ప్రమాద ఘటన పై దిలీప్ మాట్లాడుతూ - "బస్సు యాజమాన్యం కాసుల కక్రుత్తికి హైవే ప్యాట్రోల్ సిబ్బంది నిర్లక్ష్యం పదుల సంఖ్యలోని కుటుంబాల్లో విషాదాన్ని నింపిందని అన్నారు.

ట్రిప్ కి ట్రిప్ కి మధ్యన డ్రైవర్లకు సరైన విశ్రాంతి కల్పించే నిబంధనను ఎంతమంది ట్రావెల్ యాజమాన్యాలు పాటిస్తున్నాయి? అని, కోదాడ హైవే పై ప్రమాదానికి గురైన లారీ ప్రమాదాలకు కారణమయ్యే అవకాశం ఉండగా హైవే ప్యాట్రోల్ సిబ్బంది ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరించారో తెలపాలని అన్నారు.

ఈ ప్రమాదంలో మరణించిన అమాయకుల కుటుంబాలను ట్రావెల్ యాజమాన్యం మరియు హైవే నిర్వహణా సంస్థతో పాటుగా రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు అన్నిరకాలుగా ఆదుకోవాలని కోరారు. అలాగే ప్రమాద కారణాలను నిస్పక్షపాతంగా విచారించి సదరు హైవే నిర్వహణ సంస్థతో పాటుగా ట్రావెల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని అన్నారు.

SHAREEF, PONNURU

SHAREEF, PONNURU

Next Story