Guntur: భారీ వర్షాల నేపథ్యంలో కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు
Guntur: గుంటూరు జిల్లాలో భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు. సహాయం కోసం 08632234014 నంబర్ను సంప్రదించాలని కలెక్టర్ సూచన.
Guntur: భారీ వర్షాల నేపథ్యంలో కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు
గుంటూరు: అల్పపీడనం కారణంగా భారీ వర్షాలు అవకాశం ఉన్న దృష్ట్యా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ సి.యం.సాయికాంత్ వర్మ తెలిపారు.
ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. భారీ వర్షాలు, ఆకస్మిక వరదలు సమాచారాన్ని తెలుసుకోవచ్చని, ప్రజలు కూడా సమాచారం అందించవచ్చని తెలిపారు.
జిల్లా కలెక్టర్ కార్యాలయంలో 08632234014 కంట్రోల్ రూమ్ ఏర్పాటుతో పాటు అన్ని మండల కేంద్రాల్లో కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. జిల్లా అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.




