Guntur: చీకటి గోపి మృతిపై పోలీసులపై ఎట్రాసిటీ కేసు నమోదు చేయాలి

Guntur: తాడికొండ పోలీసుల చిత్రహింసలతో మృతి చెందిన చీకటి గోపి ఘటనపై సీఐపై ఎస్సీ, ఎస్టీ ఎట్రాసిటీ కేసు నమోదు చేయాలని కాంగ్రెస్ నేత వినయ్ కుమార్ డిమాండ్ చేశారు.

B RAJENDRA, GUNTUR TOWN
Published on: 7 Sept 2026 11:19 PM IST
Guntur
X

Guntur: చీకటి గోపి మృతిపై పోలీసులపై ఎట్రాసిటీ కేసు నమోదు చేయాలి

గుంటూరు: చేయని నేరానికి చీకటి గోపీ ని చిత్రహింసలకు గురిచేసిన పోలీసులపై చర్యలు తీసుకుని వారిపై ఎట్రాసిటీ కేసు నమోదు చేయాలని దళిత, ప్రజాసంఘాల నాయకులు ఎస్పీ ని కలిసి ఫిర్యాదు చేశారు.

ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కొరివి వినయ్ కుమార్ మీడియా తో మాట్లాడారు. ఏతప్పూ చేయకపోయినా తాడికొండ పోలీసులు చీకటి గోపీ ని అరెస్టు చేసి దారుణంగా టార్చర్ చేసారని చెప్పారు.

తాడికొండ పోలీస్ స్టేషన్ లో సీసీటీవీ ఫుటేజ్ తీస్తే అసలు విషయం బయటపడుతుందని చెప్పారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న గోపిని బలవంతంగా జి జి హెచ్ కి పంపించారని తెలిపారు.

తీవ్రంగా గాయపడిన చీకటి గోపీ చికిత్స పొందుతూ జీజీహెచ్ లో మరణించారని ఆవేదన వ్యక్తం చేశారు. అన్యాయంగా చీకటి గోపీని టార్చర్ చేసిన సిఐ పై ఎస్సీఎస్టీ కేసు నమోదు చేసి, సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా చీకటి గోపీ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.

B RAJENDRA, GUNTUR TOWN

B RAJENDRA, GUNTUR TOWN

Next Story