Guntur: గుంటూరు, తెనాలి మున్సిపల్ ఎన్నికల వేళ అక్టోబర్ 28న స్థానిక సెలవు!

Guntur: గుంటూరు కార్పొరేషన్, తెనాలి మున్సిపాలిటీ ఎన్నికల పోలింగ్ దృష్ట్యా అక్టోబర్ 28న స్థానిక సెలవు ప్రకటిస్తూ జిల్లా కలెక్టర్ సాయికాంత్ వర్మ ఆదేశాలు జారీ చేశారు.

B RAJENDRA, GUNTUR TOWN
Published on: 21 Oct 2026 11:41 AM IST
Guntur
X

Guntur: గుంటూరు, తెనాలి మున్సిపల్ ఎన్నికల వేళ అక్టోబర్ 28న స్థానిక సెలవు!

Guntur: గుంటూరు నగర పాలక సంస్థ, తెనాలి పురపాలక సంఘానికి ఈ నెల 28వ తేదీన పోలింగ్ ఉన్నందున సెలవును ప్రకటించడం జరిగిందని జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి సి.యం.సాయికాంత్ వర్మ తెలిపారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు.

పోలింగ్ నిర్వహించే ప్రాంతాల్లో ఉన్న అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, స్థానిక సంస్థలు, ఇతర ప్రభుత్వ సంస్థలకు ఎన్నికల సంఘం స్థానిక సెలవు ప్రకటించడం జరిగిందని చెప్పారు. ఎన్నికలు నిర్వహించనున్న ప్రాంతాల్లో ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు, కార్యాలయాల ఉద్యోగులు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు వీలుగా స్థానిక సెలవు ప్రకటించినట్లు వివరించారు.

నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ చట్టం, 1881 పరిధిలోకి వచ్చే పోలింగ్ ప్రాంతాల్లో సైతం ఇది వర్తిస్తుందని చెప్పారు. పోలింగ్‌కు ముందు రోజు, పోలింగ్ రోజు, ఓట్ల లెక్కింపు రోజున - అక్టోబర్ 27, 28, 30 తేదీల్లో - పోలింగ్ కేంద్రాలు, ఓట్ల లెక్కింపు కేంద్రాలుగా వినియోగిస్తున్న అన్ని ప్రభుత్వ భవనాలు, విద్యాసంస్థల భవనాలు, ఇతర భవనాలకు స్థానిక సెలవులు ప్రకటించడం జరిగిందని పేర్కొన్నారు.

B RAJENDRA, GUNTUR TOWN

B RAJENDRA, GUNTUR TOWN