Guntur: శిశు గృహ మేనేజర్కు రిఫ్రిజిరేటర్, స్టోరేజ్ బాక్సులు అందజేత!
Guntur: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశాల మేరకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ప్రభుత్వ శిశు గృహంలోని పిల్లల సంక్షేమం కోసం రూ. 30 వేలతో డబుల్ డోర్ రెఫ్రిజిరేటర్ అందజేశారు.
Guntur: శిశు గృహ మేనేజర్కు రిఫ్రిజిరేటర్, స్టోరేజ్ బాక్సులు అందజేత!
Guntur: గుంటూరు హై కోర్ట్ ఆంధ్రప్రదేశ్ అమరావతి వారు క్రిమినల్ రివిజన్ కేస్ లో రూ.30,000/- గుంటూరు జిల్లా న్యాయ సేవాధికార సంస్థకు చెల్లించాలని ఆదేశించారని మరియు ఆ మొత్తాన్ని ప్రభుత్వ గృహాలు / ప్రభుత్వ శిశు గృహాలలో నివసిస్తున్న పిల్లల సంక్షేమం కోసం ముఖ్యంగా వేసవి కాలంలో అవసరమైన నిత్యావసర వస్తువుల కొనుగోలుకు వినియోగించాలని ఆదేశించగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి మరియు చైర్మన్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ గుంటూరు బి. సాయి కల్యాణ చక్రవర్తి ఆదేశాలమేరకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సయ్యద్ జియాఉద్దీన్ గుంటూరు మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్ కి తేదీ 15.05.2026 న డిస్పాచ్ నెం .1236 ద్వారా లేఖ ను పంపగా వారు ఆశ్రమంలో పిల్లలకు అవసరమైన పాలు , పండ్లు , మందులు , కూరగాయలు మొదలైన వస్తువులను నిల్వ చేయడానికి ఎక్కువ నిల్వ సామర్ధ్యం గల డబల్ డోర్ రెఫ్రిజిరేటర్ ను కావాలని అడిగారు.
హై కోర్ట్ వారి ఉత్తర్వుల ప్రకారం తేదీ 28.09.2026 న రూ. 27,950/-ల IFB 265 లీటర్లు రెఫ్రిజిరేటర్ ను, రూ .2050 /- లకు స్టోరేజ్ బాక్స్ స్, వాటర్ బాటిల్ కొనుగోలు చేసి శనివారం జిల్లా ప్రధాన న్యాయమూర్తి మరియు చైర్మన్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ గుంటూరు బి. సాయి కల్యాణ చక్రవర్తి, శాశ్వత లోక్ అదాలత్ చైర్మన్ పి.వి. రాజీవ్ కలిసి గుంటూరు శిశు గృహ మేనేజర్ ఐన ఒలీవ చంద్రిక కు అందజేశారు. ఈ కార్యక్రమంలో శిశుగృహ స్టాఫ్, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ స్టాఫ్ పాల్గొన్నారు.




