Guntur: నామినేషన్లు ప్రశాంతం: గుంటూరు ఎస్పీ వకుల్ జిందాల్!

Guntur: గుంటూరు జిల్లాలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ నామినేషన్ల ప్రక్రియ పటిష్ట పోలీసు బందోబస్తు నడుమ ప్రశాంతంగా ముగిసిందని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఐపీఎస్ తెలిపారు.

B RAJENDRA, GUNTUR TOWN
Published on: 23 Oct 2026 11:42 PM IST
Guntur
X

Guntur: నామినేషన్లు ప్రశాంతం: గుంటూరు ఎస్పీ వకుల్ జిందాల్!

గుంటూరు: గుంటూరు జిల్లాలో జడ్పీటీసీ, ఎంపీటీసీ నామినేషన్ల ప్రక్రియ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా ప్రశాంతంగా ముగిసిందని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఐపీఎస్ తెలిపారు. నామినేషన్ కేంద్రాల వద్ద పటిష్ట పోలీసు బందోబస్తు, ట్రాఫిక్ నియంత్రణ, బారికేడ్ల ఏర్పాటు చేపట్టినట్లు వెల్లడించారు.

ఎన్నికలు స్వేచ్ఛగా, పారదర్శకంగా జరిగేలా నిరంతరం నిఘా కొనసాగిస్తామని, ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ప్రజలు, అభ్యర్థులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు పోలీసులకు సహకరించాలని ఎస్పీ విజ్ఞప్తి చేశారు.

B RAJENDRA, GUNTUR TOWN

B RAJENDRA, GUNTUR TOWN