Guntur: ఎన్నికల కోడ్ వేళ పి.జి.ఆర్.ఎస్ రద్దు: కలెక్టర్ సాయికాంత్ వర్మ!

Guntur: ఎన్నికల విధుల్లో అధికారులు నిమగ్నమైనందున మరియు ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున గుంటూరు జిల్లాలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS)ను రద్దు చేసినట్లు కలెక్టర్ తెలిపారు.

B RAJENDRA, GUNTUR TOWN
Published on: 1 Nov 2026 11:40 PM IST
Guntur
X

Guntur: ఎన్నికల కోడ్ వేళ పి.జి.ఆర్.ఎస్ రద్దు: కలెక్టర్ సాయికాంత్ వర్మ!

గుంటూరు: ఎన్నికల విధులలో అధికారులందరూ నిమగ్నం కావడం వలన మరియు ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులో ఉండటం వలన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పి.జి.ఆర్.ఎస్) తాత్కాలికంగా రద్దు చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ సి.యం.సాయికాంత్ వర్మ తెలిపారు.

ఈ మేరకు ఆదివారం అధికారులతో నిర్వహించిన టెలి కాన్ఫరెన్స్ లో చెప్పారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి పూర్తి అయ్యేవరకు పి.జి.ఆర్.ఎస్ రద్దు చేయడం జరిగిందని చెప్పారు. ఈ అంశాన్ని ప్రజలు గమనించి సోమవారం వ్యయప్రయాసలకు ఓర్చి రావద్దని విజ్ఞప్తి చేశారు.

B RAJENDRA, GUNTUR TOWN

B RAJENDRA, GUNTUR TOWN