Guntur: గుంటూరులో ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) రద్దు!
Guntur: ఎన్నికల కోడ్, విధుల దృష్ట్యా గుంటూరులో పీజీఆర్ఎస్ తాత్కాలికంగా రద్దు చేసినట్లు కలెక్టర్ సాయికాంత్ వర్మ తెలిపారు. సోమవారం ప్రజలు రావద్దని కోరారు.
Guntur: గుంటూరులో ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) రద్దు!
గుంటూరు: ఎన్నికల విధులలో జిల్లా యంత్రాంగం నిమగ్నం కావడం వలన మరియు ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులో ఉండటం వలన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పి.జి.ఆర్.ఎస్) తాత్కాలికంగా రద్దు చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ సి.యం.సాయికాంత్ వర్మ తెలిపారు.
ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి పూర్తి అయ్యేవరకు పి.జి.ఆర్.ఎస్ ను రద్దు చేయడం జరిగిందని చెప్పారు. ఈ అంశాన్ని ప్రజలు గమనించి సోమవారం వ్యయప్రయాసలకు ఓర్చి రావద్దని విజ్ఞప్తి చేశారు.




