Guntur: బాజీ వలి ఆత్మహత్య కేసు ప్రచారంపై ఈస్ట్ డీఎస్పీ స్పష్టత
Guntur: బాజీ వలి ఆత్మహత్య ఘటనపై పాత గుంటూరు పోలీసులు కేసు నమోదు చేయలేదనడంలో వాస్తవం లేదని ఈస్ట్ డీఎస్పీ సీతారామ్ స్పష్టం చేశారు.
Guntur: బాజీ వలి ఆత్మహత్య కేసు ప్రచారంపై ఈస్ట్ డీఎస్పీ స్పష్టత
గుంటూరు: ఈస్ట్ డీఎస్పీ సీతారామ్ కామెంట్స్ బాజీ వలి ఆత్మహత్య ఘటనపై పాత గుంటూరు పోలీసులు కేసు నమోదు చేయలేదన్న ప్రచారంలో వాస్తవం లేదు. బాజీ వలి ఘటనకు సంబంధించి ఇప్పటికే, కొత్తపేట, నల్లపాడు పోలీస్ స్టేషన్ లో 3 కేసులు నమోదు అయ్యాయి, విచారణ కొనసాగుతుంది.
వివాహం/నిశ్చితార్థానికి సంబంధించిన వివాదం, కట్నం డిమాండ్, మరో మహిళతో సంబంధం తదితర అంశాలపై కేసులు నమోదు చేసారు. బాజీ వలి తల్లి ఆత్మహత్యకు సంబంధించిన అంశంలో కోర్టును ఆశ్రయించి డిఫమేషన్ కేసు వేసుకోవాలని సూచించాం.
ఆ కేసు అంశంలో ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతోనే కేసు నమోదు చేయలేదు. సోషల్ మీడియాలో బాజీ వలి కుటుంబ సభ్యులను వేధింపులకు గురిచేస్తున్న అంశంపై కోర్టు ద్వారా విచారణ కోరవచ్చని సూచించాము. పోలీసులపై అసత్య ప్రచారాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. ఈ ఘటనకు సంబంధించి సంబంధిత పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు చేసి దర్యాప్తు కొనసాగుతుంది.




