Guntur: పొన్నూరు రోడ్డు సబ్‌స్టేషన్‌లో షార్ట్ సర్క్యూట్ రంగంలోకి ఎమ్మెల్యే!

Guntur: గుంటూరు పొన్నూరు రోడ్డు ఎలక్ట్రిక్ సబ్‌స్టేషన్‌లో షార్ట్ సర్క్యూట్. సంఘటనా స్థలానికి చేరుకుని విద్యుత్ పునరుద్ధరణ పనులను పర్యవేక్షించిన ఎమ్మెల్యే మొహమ్మద్ నసీర్.

B RAJENDRA, GUNTUR TOWN
Published on: 28 Aug 2026 8:29 AM IST
Guntur
X

Guntur: పొన్నూరు రోడ్డు సబ్‌స్టేషన్‌లో షార్ట్ సర్క్యూట్ రంగంలోకి ఎమ్మెల్యే!

Guntur: గుంటూరు తూర్పు నియోజకవర్గ పరిధిలోని పొన్నూరు రోడ్డు ఎలక్ట్రిక్ సబ్‌స్టేషన్‌లో 130 కేవీ విద్యుత్ వ్యవస్థలో షార్ట్ సర్క్యూట్ కారణంగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.

సమాచారం అందుకున్న వెంటనే గుంటూరు తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు మొహమ్మద్ నసీర్ గారు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. విద్యుత్ శాఖ అధికారులతో మాట్లాడి సమస్యకు గల కారణాలను తెలుసుకున్నారు.

ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో యుద్ధప్రాతిపదికన మరమ్మతు పనులు పూర్తి చేసి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించాలని అధికారులను ఎమ్మెల్యే నసీర్ గారు ఆదేశించారు. విద్యుత్ సరఫరా పూర్తిగా పునరుద్ధరించే వరకు తాను సంఘటనా స్థలంలోనే ఉండి అధికారులతో సమన్వయం చేస్తానని, అవసరమైన చర్యలు తీసుకున్న అనంతరం ప్రజల ఇళ్లకు వెళ్తానని ఎమ్మెల్యే నసీర్ గారు తెలిపారు.

ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేస్తున్నారని ఆయన పేర్కొన్నారు.

B RAJENDRA, GUNTUR TOWN

B RAJENDRA, GUNTUR TOWN

Next Story