Guntur: విద్యార్థులకు ఉచిత పుస్తకాల పంపిణీ చేసిన గుంటూరు ఎమ్మెల్యే నసీర్

Guntur: గుంటూరు ఆర్‌ అగ్రహారంలో వాసవి మిత్రమండలి ఆధ్వర్యంలో ఉచిత పుస్తకాల పంపిణీ. పాల్గొన్న గుంటూరు తూర్పు ఎమ్మెల్యే, అసెంబ్లీ మైనార్టీస్ కమిటీ చైర్మన్ నసీర్.

B RAJENDRA, GUNTUR TOWN
Published on: 24 Aug 2026 7:17 AM IST
Guntur
X

Guntur: విద్యార్థులకు ఉచిత పుస్తకాల పంపిణీ చేసిన గుంటూరు ఎమ్మెల్యే నసీర్

Guntur: విద్యార్థులు ఎప్పటికప్పుడు దాతలు అందించే సాయాన్ని సద్వినియోగం చేసుకొని ఉన్నతంగా ఎదగాలని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే, అసెంబ్లీ మైనార్టీస్ కమిటీ చైర్మన్ నసీర్ ఆకాంక్షించారు. ఆదివారం స్థానిక ఆర్ అగ్రహారంలోని శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం నందు వాసవి మిత్రమండలి ఆధ్వర్యంలో విద్యార్థులకు ఉచితంగా పుస్తకాలు పంపిణీ చేశారు.

వాసవి మిత్ర మండలి అధ్యక్షుడు అన్న పూర్ణచంద్రరావు అధ్యక్షత వహించిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే నసీర్ మాట్లాడుతూ వాసవి మిత్ర మండలి వారు విద్యార్థులకు ఉచిత సేవలు అందించటం అభినందనీయమని చెప్పారు. విద్యార్థులు విలువలతో కూడిన విద్యను అభ్యసించాలని సూచించారు.

జీవితంలో ఉన్నత స్థానంలో నిలిచినప్పుడు సమాజానికి తమ వంతు సహకారం అందించాలని చెప్పారు. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వస్తువులు కల్పనకు ప్రత్యేక చర్యలు తీసుకున్నామని తెలిపారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు తిరుపతిరావు, ప్రధాన కార్యదర్శి కూనిశెట్టి చంద్రశేఖర్ రావు, కోశాధికారి త్రిపురమల్లు అశోక్ కుమార్, సేవాకమిటి చైర్మన్ కొరళ్ల వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

B RAJENDRA, GUNTUR TOWN

B RAJENDRA, GUNTUR TOWN

Next Story