Guntur: వార్డుల్లో పర్యటించి అభివృద్ధి పనులు పరిశీలించిన ఎమ్మెల్యే నసీర్!

Guntur: గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఎమ్మెల్యే నసీర్ పలు వార్డుల్లో పర్యటించి అభివృద్ధి పనులను పరిశీలించి, అధికారులకు సమస్యల పరిష్కారంపై కీలక ఆదేశాలు జారీ చేశారు.

B RAJENDRA, GUNTUR TOWN
Published on: 1 Oct 2026 7:54 AM IST
Guntur
X

Guntur: వార్డుల్లో పర్యటించి అభివృద్ధి పనులు పరిశీలించిన ఎమ్మెల్యే నసీర్!

Guntur: అన్ని వీధులను అద్దంలా, పరిశుభ్రంగా తీర్చిదిద్దాలని, చెత్తాచెదారాలు ఎక్కడ కనిపించినా సహించబోనని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే, అసెంబ్లీ మైనార్టీస్ కమిటీ చైర్మన్ నసీర్ స్పష్టం చేశారు. బుధవారం నియోజకవర్గంలోని 12,13, 14 వార్డుల్లో ఎమ్మెల్యే నసీర్ పర్యటించారు. లాలాపేట, చౌత్ర సెంటర్, మంత్రుల బజార్, సంగడిగుంట, వడ్డెరగూడెం, క్రిస్టియన్ పేట ప్రాంతాలలో చేపట్టిన అభివృద్ధి పనులను పరిశీలించారు.

ఈ సందర్భంగా ప్రజలతో స్వయంగా మాట్లాడి స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు, ప్రధాన డ్రెయిన్లలో సిల్ట్ పేరుకుపోయి ఉండటాన్ని చూసి వెంటనే సంబంధిత మున్సిపల్ అధికారులను పిలిపించారు. ఎక్కడా మురుగు నిల్వలు ఉండకూడదని, వెంటనే దీనిపై చర్యలు తీసుకోవాలని సూచించారు. విద్యుత్ సరఫరాలో ఎలాంటి ఆటంకం లేకుండా చూసుకోవాలన్నారు అవసరమైన చోట విద్యుత్ దీపాలు, స్తంభాలు ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

రోడ్ల నిర్మాణంలో నాణ్యత పాటించాలని, పారదర్శకంగా పూర్తి చేయాలని సూచించారు. మారుమూల ప్రాంతాలకు సైతం సీసీ రోడ్ల నిర్మాణానికి చర్యలు చేపట్టామన్నారు. డ్రెయిన్ల నిర్మాణంతోపాటు మంచినీటి పైపు లైన్లు ఏర్పాటు చేస్తున్నామని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మంచి పాలన అందిస్తున్నామని సందర్భంగా ఎమ్మెల్యే నసీర్ స్పష్టం చేశారు. స్థానికంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఉన్న వెంటనే తనను సంప్రదించాలని భరోసా కల్పించారు.

B RAJENDRA, GUNTUR TOWN

B RAJENDRA, GUNTUR TOWN