Guntur: ఓటు హక్కును సరి చూసుకోవాలని కోరిన ఎమ్మెల్యే నసీర్!
Guntur: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఓటర్ల జాబితాలో ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును సరి చూసుకోవాలని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నసీర్ కూటమి నాయకులకు స్పష్టం చేశారు.
Guntur: ఓటు హక్కును సరి చూసుకోవాలని కోరిన ఎమ్మెల్యే నసీర్!
Guntur: స్థానిక సంస్థల ఎన్నికల వేళ ఓటర్ల జాబితాలో ప్రతి ఒక్కరూ తమ ఓటును సరి చూసుకోవాలని, దీనిపై నాయకులు ఓటర్లకు దిశానిర్దేశం చేయాలని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే, అసెంబ్లీ మైనార్టీస్ కమిటీ చైర్మన్ నసీర్ సూచించారు. బుధవారం స్థానిక తూర్పు కార్యాలయంలో కూటమి నాయకులతో ఎమ్మెల్యే నసీర్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా గుంటూరు తూర్పు నియోజకవర్గంలో నూతనంగా రూపొందించిన ఓటర్ల జాబితాపై చర్చించారు. కేంద్ర ఎన్నికల సంఘం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సర్ కార్యక్రమం ద్వారా ఓటర్ల మ్యాపింగ్ పూర్తయిందని తెలిపారు. నూతనంగా ఓటు నమోదు చేసుకున్న వారు తమ ఓటు హక్కు లభించిందో లేదో పరిశీలించుకోవాలన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలను కూటమి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుందని, ప్రతి ఒక్కరూ దీనిపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సహకారంతో రెండున్నరేళ్లలో గుంటూరు తూర్పు నియోజకవర్గంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అర్హులందరికీ చేరువ చేశామన్నారు. ప్రజలకు జరిగిన మంచి గురించి ప్రతి గడపకూ తెలియజేయాల్సిన బాధ్యత నాయకులదేనని స్పష్టం చేశారు. గుంటూరు మున్సిపాలిటీలో అత్యధిక మెజారిటీ కూటమి నాయకులు ఉంటే మరింత అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించుకునేందుకు, గుంటూరు నగరాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్ళేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు.




