Guntur: గుంటూరు రెవెన్యూ విభాగంలో మహిళా ఉద్యోగిని కన్నీటి గాథ!

Guntur: గుంటూరు తూర్పు తహసిల్దార్ కార్యాలయంలో మహిళా కంప్యూటర్ ఆపరేటర్‌పై ఉన్నతాధికారుల వేధింపులు. రాత్రి వేళల్లో ఒంటరిగా విధులకు బలవంతం.

AVINASH, GUNTUR CITY
Published on: 17 July 2026 4:35 PM IST
Guntur
X

Guntur: గుంటూరు రెవెన్యూ విభాగంలో మహిళా ఉద్యోగిని కన్నీటి గాథ!

Guntur: గుంటూరు తూర్పు మండలం తహసిల్దార్ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేస్తున్న మహిళా ఉద్యోగిని, ఉన్నతాధికారుల వేధింపులపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

గత కొన్ని నెలలుగా ఆఫీస్ సమయాలు ముగిసినప్పటికీ, నిబంధనలకు విరుద్ధంగా రాత్రి పూట కూడా విధులు నిర్వహించాలంటూ తహసిల్దార్ బలవంతం చేస్తున్నారని బాధితురాలు ఆరోపించారు.

తనకు ఒకటిన్నర ఏళ్లు, మూడేళ్ల వయసున్న ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారని.. ఇంట్లో ఎలాంటి సపోర్ట్ లేదని మొరపెట్టుకున్నా అధికారులు పట్టించుకోలేదని వాపోయారు.

గత నెల 9వ తేదీన బాబుకు తీవ్ర జ్వరం రావడంతో ఇంటికి వెళ్తానని బ్రతిమిలాడినా.. "సెంటిమెంట్స్ మాట్లాడొద్దు, మాకూ ఫ్యామిలీస్ ఉన్నాయి, రాత్రి 10 గంటల వరకు పని చేయాల్సిందే" అని అధికారులు హుకుం జారీ చేశారని తెలిపారు.

చిన్న పిల్లలను చూసుకునే దిక్కు లేక, లోకల్‌గా ఉన్న వారి ద్వారా పిల్లలను ఆఫీస్‌కే పిలిపించుకుని రాత్రి 9:40 కి కార్యాలయం లోనే పాలు ఇవ్వాల్సి వచ్చిందని కన్నీరు పెట్టుకున్నారు .

రాత్రి 10 గంటల వరకు డ్యూటీ చేయించుకుని, ఆ సమయంలో ఒంటరిగా ఒక మహిళ ఎలా వెళ్తుందనే కనీస ఆలోచన కూడా లేకుండా తహసిల్దార్ కార్ ఎక్కి వెళ్లిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రభుత్వాలు, ముఖ్యమంత్రి ఆడవాళ్లకు గౌరవం ఇస్తామని, ప్రాధాన్యత ఇస్తామని చెబుతుంటే.. క్షేత్రస్థాయిలో అధికారులు మాత్రం మహిళలను బానిసల్లా, చూస్తున్నారని మండిపడ్డారు.

AVINASH, GUNTUR CITY

AVINASH, GUNTUR CITY