Guntur: జీఎంసీ ఎన్నికల ఏర్పాట్లు వేగవంతం చేయాలి: కమిషనర్

Guntur: గుంటూరు నగరపాలక సంస్థ ఎన్నికల నిర్వహణకు 596 పోలింగ్ కేంద్రాలు, 27 మంది ఆర్‌ఓలను నియమించామని కమిషనర్ కె.మయూర్ అశోక్ తెలిపారు. ఏసీ కాలేజీని పరిశీలించారు.

B RAJENDRA, GUNTUR TOWN
Published on: 12 Oct 2026 3:41 PM IST
Guntur
X

Guntur: జీఎంసీ ఎన్నికల ఏర్పాట్లు వేగవంతం చేయాలి: కమిషనర్

గుంటూరు: గుంటూరు నగరపాలక సంస్థ స్థానిక ఎన్నికల నిర్వహణను అత్యంత పటిష్టంగా, పారదర్శకంగా చేపట్టేందుకు అవసరమైన ముందస్తు చర్యలను వేగవంతం చేయాలని నగర కమిషనర్, అడిషనల్ ఎలక్షన్ అధారిటీ కె.మయూర్ అశోక్ అధికారులను ఆదేశించారు. సోమవారం కమిషనర్ స్థానిక ఏసి కాలేజీ ప్రాంగణాన్ని పరిశీలించి, ఎన్నికల సామాగ్రి పంపిణీకి అవసరమైన చర్యలు తీసుకోవడంపై అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు.

ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, గుంటూరు నగరపాలక సంస్థలో 76 వార్డ్ లకు సంబంధించి 596 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికల నిర్వహణకు ఇప్పటికే 27 మంది రిటర్నింగ్ అధికారులను నియామకం చేశామన్నారు. రిటర్నింగ్ అధికారుల వారీగా ఎన్నికల సామాగ్రి సక్రమంగా ఇబ్బందులు లేకుండా అందించేందుకు పటిష్ట చర్యలు తీసుకోవాలన్నారు.

డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుండి సామాగ్రి తరలించడానికి వచ్చే బస్ లకు సరైన మార్గం ఉండేలా, సిబ్బందికి భోజనం సదుపాయం పక్కాగా చేపట్టాలని ఇంజినీరింగ్, పట్టణ ప్రణాళిక అధికారులను ఆదేశించారు. ఎన్నికల నిర్వహణలో అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో వ్యవహరించి ఏర్పాట్లను వేగవంతం చేయాలన్నారు.

పర్యటనలో అదనపు కమిషనర్లు ఐ.కిషోర్, జి.రవీంధ్ర (ఎస్డబ్ల్యూ), డిప్యూటి కమిషనర్లు జి.సాంబశివరావు, బి.శ్రీనివాసరావు, సిహెచ్.శ్రీనివాస్, ఎస్ఈ జి.వెంకటేశ్వరరావు, సిటి ప్లానర్ డి.రాంబాబు, ఏసిపీ జకిరా, డిఈఈ హనీఫ్, ఎస్ ఎస్ సాంబయ్య, సర్వేయర్లు లక్ష్మీనారయణ, సుభాని పాల్గొన్నారు.

B RAJENDRA, GUNTUR TOWN

B RAJENDRA, GUNTUR TOWN