Guntur: గుంటూరులో ఎమ్మెల్సీ వర్ల రామయ్యకు సన్మానం, ఆనందబాబు!
Guntur: గుంటూరులో టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు వర్ల రామయ్య ఎమ్మెల్సీగా ఎన్నికైన సందర్భంగా అభినందన సభ; పాల్గొన్న మాజీ మంత్రి నక్కా ఆనందబాబు.
Guntur: గుంటూరులో ఎమ్మెల్సీ వర్ల రామయ్యకు సన్మానం, ఆనందబాబు!
Guntur: తెలుగుదేశం పార్టీలో దశాబ్దాలుగా నిబద్ధతతో పనిచేస్తూ అంచలంచెలుగా ఎదిగిన సీనియర్ నాయకులు, పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యులు వర్ల రామయ్య శాసనమండలి సభ్యునిగా నియమితులైన సందర్భంగా గుంటూరులోని వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో ఆత్మీయ అభినందన సభ నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో మాజీ మంత్రివర్యులు, వేమూరు శాసనసభ్యులు నక్కా ఆనందబాబు పాల్గొని, ఎమ్మెల్సీగా ఎన్నికైన వర్ల రామయ్య ని ఘనంగా అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నక్కా ఆనందబాబు మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీకి వర్ల రామయ్య దశాబ్దాలుగా అందిస్తున్న సేవలు, పార్టీ సిద్ధాంతాల పట్ల ఆయన చూపిన నిబద్ధత, క్రమశిక్షణ ప్రశంసనీయమని అన్నారు.
ఎమ్మెల్సీగా ప్రజా సమస్యలను శాసనమండలిలో బలంగా వినిపిస్తూ, ప్రజా సంక్షేమం కోసం మరింతగా కృషి చేయాలని ఆకాంక్షించారు. వర్ల రామయ్య ని శాసనమండలి సభ్యునిగా నియమించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కి, ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.




