Guntur: రావెల కిషోర్ బాబు ఆరోపణలు అవాస్తవం - మాజీ డీఐజీ బాలస్వామి

Guntur: మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు ఆరోపణలపై మాజీ డీఐజీ బాలస్వామి తీవ్రంగా స్పందించారు. ఆయనపై పరువు నష్టం దావా వేస్తామని హెచ్చరించారు.

B RAJENDRA, GUNTUR TOWN
Published on: 1 Sept 2026 5:50 PM IST
Guntur
X

Guntur: రావెల కిషోర్ బాబు ఆరోపణలు అవాస్తవం - మాజీ డీఐజీ బాలస్వామి

గుంటూరు: మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు ఇటీవల చేసిన ఆరోపణలను రిజిస్ట్రేషన్ శాఖ మాజీ డిఐజీ చావలి బాలస్వామి, అడ్వకేట్ రాయపూడి మాణిక్యారావు, కాకుమాను పున్నారావు ఖండించారు.

బాలస్వామి పై నిరాధారమైన ఆరోపణలు చేశారని చెప్పారు. మంగళవారం బాలస్వామి, మాణిక్యారావు, పున్నారావు మీడియాతో మాట్లాడారు. ఎలాంటి అగ్రిమెంట్ లేకుండా నాలుగున్నర కోట్ల రూపాయలు ఎలా ఇచ్చారని ప్రశ్నించారు.

నిరాధారమైన ఆరోపణలు చేసిన కిషోర్ బాబు పై పరువు నష్టం దావా వేస్తామని వెల్లడించారు. ఒక మంత్రిగా పని చేసిన వ్యక్తి అసైన్డ్ భూములు ఎలా కొనుగోలు చేశారని తెలిపారు. ఎన్నికల సమయంలో బాలస్వామి ద్వారా డబ్బులు కూడా తీసుకున్నారని తెలిపారు. ఆర్ధిక నేరాలకు పాల్పడిన కిషోర్ బాబు పై సమగ్రంగా దర్యాప్తు జరిపి, చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కోరారు.

B RAJENDRA, GUNTUR TOWN

B RAJENDRA, GUNTUR TOWN

Next Story