Vinjanampadu: కిట్స్ కళాశాలలో కోలాహలంగా ఫ్రెషర్స్ డే వేడుకలు
Vinjanampadu: వింజనంపాడు కిట్స్ కళాశాలలో ఫ్రెషర్స్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. విద్యార్థులు నైపుణ్యాలు పెంపొందించుకోవాలని కళాశాల ఛైర్మన్ కోయి సుబ్బారావు పిలుపునిచ్చారు.
Vinjanampadu: కిట్స్ కళాశాలలో కోలాహలంగా ఫ్రెషర్స్ డే వేడుకలు
వింజనంపాడు: స్థానిక కె.కె.ఆర్ అండ్ కె.ఎస్.ఆర్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (కిట్స్ కళాశాల)లో న ఫ్రెషర్స్ డే వేడుకలు కనుల పండుగగా జరిగాయి. 2026-2027 విద్యా సంవత్సరానికి చెందిన మొదటి సంవత్సరం బీ.టెక్ విద్యార్థులకు వారి సీనియర్ విద్యార్థులు అద్భుతమైన ఆహ్వానం పలికారు. ఈ వేడుకలను కళాశాల యాజమాన్యం జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి కళాశాల ఛైర్మన్, కార్యదర్శి, డైరెక్టర్ మరియు వివిధ విభాగాధిపతులు హాజరై తమ సందేశాలను ఇచ్చారు.
ఈ సందర్భంగా కళాశాల ఛైర్మన్ డా కోయి సుబ్బారావు గారు మాట్లాడుతూ ఈ కళాశాల విద్యార్థులు నైపుణ్యాలను మెరుగుపరచుకునేలా ఉండాలిని, ప్రస్తుతం ఉన్నటువంటి జాబ్ మార్కెట్లో కమ్యూనికేషన్ స్కిల్స్, విత్ కోడింగ్ స్కిల్స్ ఎంతో ప్రాముఖ్యత ఉన్నది, కిట్స్ లో వీటికి మరింత ఎక్కువ ప్రాధాన్యతని కోసం వివిధ కార్యక్రమాలను రూపొందించి అమలుపరుస్తున్నామనిఇస్తున్నాముని తెలియజేశారు.
ప్రతి ఒక్కరికి ఒక ఆదర్శం ఉండాలి, సమాజానికి ఏదో ఒకటి చేయాలని తపన ఉండాలి, మేము కూడా ఒక చిన్న రైతు కుటుంబం నుంచి ఈ స్థాయికి ఎదిగాము. మీ పేరెంట్స్ ఇప్పటివరకు మీకు చాలా సపోర్ట్ చేశారు, మీ ఆరోగ్యం విషయాల్లోనూ చదువుల విషయాల్లోనూ, మరియు ప్రభుత్వాలు కూడా ఎంతో సపోర్ట్ చేస్తున్నాయి. కాబట్టి కేవలం ఉపాధి దిశగా కాకుండా విద్యార్థులు తమ స్వశక్తితో, తెలివితేటలతో పారిశ్రామికవేత్తలుగా స్థిరపడటానికి కావాల్సిన నైపుణ్యాలను అందిస్తామని తెలిపారు.
విద్యార్థులు పరిశోధన మరియు నూతన ఆవిష్కరణల దిశగా అత్యంత ప్రతిభ కనబరిచేలా ప్రోత్సహిస్తున్నామని, వారు రూపొందించిన ఆవిష్కరణలు జాతీయ స్థాయి గుర్తింపు పొందాయని అన్నారు.
చదువుకోవాల్సిన వయసులో చదువుకోవాలి చెడు అలవాట్లకు బానిస కాకుండా తల్లిదండ్రుల గురించి ఆలోచించి ఉన్నత స్థాయిలోకి వెళ్లాలి అని,ఈ మధ్యకాలంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు ప్రారంభించినటువంటి చాలా ప్రోగ్రామ్స్ మన దేశానికి రానున్న రోజుల్లో ఎంతో గొప్పపేరు ప్రఖ్యాతలు వస్తాయని, భారతదేశం ప్రపంచంలోనే రెండవ ఆర్థిక వ్యవస్థగా ఏర్పడిపోతుందని తెలియజేశారు.
కళాశాల కార్యదర్శి శ్రీ కోయి శేఖర్ గారు మాట్లాడుతూ చదువుతో పాటు విద్యార్థులు అన్ని రంగాల్లో అవగాహన కలిగి ఉండాలని మరియు క్రమశిక్షణ అవలంభిస్తూ లక్ష్యం దిశగా కృషి చేస్తూ తల్లిదండ్రుల ఆశయాలను సాకారం చేసేలా విద్యార్థులు ముందడుగు వేయాలని తెలియజేశారు.నాలెడ్జ్ తో పాటు , నాయకత్వ లక్షణాలను కొన్ని ఉదాహరణలతో వివరించారు.ప్రతి విద్యార్థి , తల్లితండ్రులతో సఖ్యతగా ఉండి వారి యొక్క అనుగుణంగా చదువుకుంటూ సమాజంలో మంచి పేరు తీసుకురావాలని,కాలేజీలో కానీ మీ కుటుంబంలో గానీ సమాజంలో గాని తప్పులు చేయొద్దు తప్పు చేసిన తర్వాత దాన్ని కప్పి ఉంచడానికి మరిన్ని మరికొన్ని తప్పులు చేయవద్దుని కొన్ని ఉదాహరణలతో తెలియజేశారు.
కళాశాల అకడమిక్ డైరెక్టర్ డా. కె.హరిబాబు గారు మరియు వివిధ విభాగాధిపతులు మాట్లాడుతూ విద్యార్థులకు పలురకాల సూచనలు చేశారు. విద్యార్థులు ప్రదర్శించిన వివిధ సాంసృతిక కార్యక్రమాలతో వేదిక కోలాహలంగా మారింది. విద్యార్థులు ఆటపాటలతో వేడుకను ఉల్లాసంగా జరుపుకున్నారు.




