Guntur: లాపరోస్కోపిక్ వీవీఎఫ్ సర్జరీ విజయవంతం!

Guntur: గుంటూరు జీజీహెచ్ యూరాలజీ వైద్యులు రాష్ట్రంలోనే మొదటిసారిగా లాపరోస్కోపిక్ వీవీఎఫ్ శస్త్రచికిత్సను విజయవంతం చేసి పేద మహిళకు పునర్జన్మ నిచ్చారు.

B RAJENDRA, GUNTUR TOWN
Published on: 14 Oct 2026 10:51 PM IST
Guntur
X

Guntur: లాపరోస్కోపిక్ వీవీఎఫ్ సర్జరీ విజయవంతం!

గుంటూరు: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైద్యరంగంలో ఒక విశేషమైన ముందడుగుగా, గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రి (GGH) యూరాలజీ విభాగం వైద్యులు అత్యంత క్లిష్టమైన లాపరోస్కోపిక్ వెసికోవాజైనల్ ఫిస్టులా (VVF) రిపేర్ శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ వైద్యరంగంలో ఈ తరహా శస్త్రచికిత్స తొలిసారిగా నిర్వహించిన ఘనతను GGH గుంటూరు సాధించింది.

గత ఆరు నెలలుగా నిరంతర మూత్ర లీకేజీతో బాధపడుతూ, ఇంటి నుంచి బయటకు కూడా రాలేని పరిస్థితిలో ఉన్న మహిళకు ఈ అధునాతన శస్త్రచికిత్స నిర్వహించారు. మూత్రాశయం, యోని మధ్య ఏర్పడిన అసాధారణ మార్గాన్ని లాపరోస్కోపిక్ విధానంలో సరిచేశారు.

యూరాలజీ విభాగాధిపతి డాక్టర్ మనోహర్ నాయకత్వంలో, డాక్టర్ కార్తీక్ ఆరే, డాక్టర్ రాకేష్ ఈ క్లిష్టమైన లాపరోస్కోపిక్ శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు. వీరికి డాక్టర్ సమ్మోహిత్‌తో పాటు ఇతర వైద్య సిబ్బంది సహకరించారు.

అనస్థీషియా విభాగాధిపతి డాక్టర్ పోలయ్య, డాక్టర్ దీపక్ మరియు అనస్థీషియా బృందం ఈ శస్త్రచికిత్సలో కీలక పాత్ర పోషించారు.

GGH సూపరింటెండెంట్ డాక్టర్ జి. దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో సాధించిన ఈ విజయం ప్రభుత్వ వైద్యరంగంలో ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలిచింది.

ప్రైవేట్ ఆసుపత్రుల్లో రూ. 2 లక్షలకు పైగా ఖర్చయ్యే ఇటువంటి అధునాతన శస్త్రచికిత్సలను ప్రభుత్వ ఆసుపత్రిలో అందుబాటులోకి తీసుకురావడం పేద, మధ్యతరగతి ప్రజలకు ఎంతో ప్రయోజనకరం.

అధునాతన వైద్యం సామాన్య ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడమే GGH గుంటూరు లక్ష్యం

B RAJENDRA, GUNTUR TOWN

B RAJENDRA, GUNTUR TOWN