Guntur: నవంబర్ 3న భారీ వర్షాలు.. అత్యవసరమైతేనే బయటకు రండి!

Guntur: "మురసు" తుఫాన్ నేపథ్యంలో గుంటూరు కార్పొరేషన్‌లో 0863 2345103 నంబర్‌తో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని కమిషనర్ మయూర్ అశోక్ సూచించారు.

B RAJENDRA, GUNTUR TOWN
Published on: 1 Nov 2026 11:56 PM IST
Guntur
X

Guntur: నవంబర్ 3న భారీ వర్షాలు.. అత్యవసరమైతేనే బయటకు రండి!

గుంటూరు: వాయుగుండం మరింత బలపడి తీవ్ర వాయుగుండంగా, అనంతరం తుఫానుగా మారి, నవంబరు 2 నాటికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ సూచనల మేరకు గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో ముందస్తు చర్యలు తీసుకోనున్నామన్నారు.

3 వ తేదీన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున, గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. గాలులకు హోర్టింగులు, చెట్లు కూలిపోయే పరిస్థితి ఉంటుందని, అర్నాబ్ తుఫాన్ లో తొలగించామని, మరోసారి తనిఖీ చేయాలని పట్టణ ప్రణాళిక, హార్టికల్చర్ అధికారులకు ఆదేశం.

లోతట్టు ప్రాంతాలు, అండర్ పాస్ ల వద్ద నీరు నిలువ ఉండే అవకాశం ఉందని, ఆ ప్రాంతాల్లో ముందుగానే ఆయిల్ ఇంజిన్ లు ఏర్పాటు చేసుకోవాలన్నారు. త్రాగునీటి సరఫరాలో సమస్యలు తలెత్తకుండా జనరేటర్లు సిద్దం చేసుకోవాలన్నారు. ప్రజలు కూడా తుఫాన్ సమయంలో అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దని, అలాగే నగరపాలక సంస్థ సరఫరా చేసే త్రాగునీటిని కాచి చల్లార్చి త్రాగాలని సూచన.

B RAJENDRA, GUNTUR TOWN

B RAJENDRA, GUNTUR TOWN