Guntur: జీఎంసీలో పి.జి.ఆర్.ఎస్ రద్దు: కమిషనర్ మయూర్ అశోక్!

Guntur: స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ మరియు అధికారుల ఎన్నికల విధుల దృష్ట్యా గుంటూరు నగరపాలక సంస్థలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) తాత్కాలికంగా రద్దయినట్లు కమిషనర్ తెలిపారు.

B RAJENDRA, GUNTUR TOWN
Published on: 1 Nov 2026 11:51 PM IST
Guntur
X

Guntur: జీఎంసీలో పి.జి.ఆర్.ఎస్ రద్దు: కమిషనర్ మయూర్ అశోక్!

గుంటూరు: స్థానిక ఎన్నికల విధులలో అధికారులందరూ నిమగ్నం కావడం వలన మరియు ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులో ఉండటం వలన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పి.జి.ఆర్.ఎస్) తాత్కాలికంగా రద్దు చేయడం జరిగిందని నగర కమిషనర్ కె. మయూర్ అశోక్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి పూర్తి అయ్యేవరకు పి.జి.ఆర్.ఎస్ రద్దు చేయడం జరిగిందని చెప్పారు. ఈ అంశాన్ని ప్రజలు గమనించాలని కోరారు.

B RAJENDRA, GUNTUR TOWN

B RAJENDRA, GUNTUR TOWN