Guntur: అప్పు చెల్లించినా వేధింపులు ఆపట్లేదంటూ మహిళ ఆవేదన
Guntur: గుంటూరులో తీసుకున్న అప్పుకు రూ.5 లక్షలకు పైగా చెల్లించినా ఇంకా వేధిస్తున్నారంటూ గౌస్య బేగం ఆవేదన వ్యక్తం చేశారు. తనకు రక్షణ కల్పించాలని కోరారు.
Guntur: అప్పు చెల్లించినా వేధింపులు ఆపట్లేదంటూ మహిళ ఆవేదన
గుంటూరు: గుంటూరులో తనపై కొంతమంది వ్యక్తులు అనవసరంగా వేధింపులకు పాల్పడుతున్నారని గౌస్య భేగం ఆరోపించారు. తన పరిధిలో 25 సంఘాలు, 25 గ్రూపులు ఉన్నాయని, గత 8 ఏళ్లుగా ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తున్నప్పటికీ తనపై ఎలాంటి గ్రీవెన్స్ లేదా అధికారిక రిమార్క్ లేదని ఆమె తెలిపారు.
వ్యక్తిగత అవసరాల కోసం బిస్మిల్లా MSS గ్రూప్‌కు చెందిన హసీనా వద్ద నుంచి రూ.2 లక్షలు అప్పుగా తీసుకున్నానని గౌస్య భేగం పేర్కొన్నారు. రూ.10 వడ్డీకి తీసుకున్న ఆ మొత్తాన్ని విడతల వారీగా చెల్లించానని తెలిపారు. సుమారు 10 మంది సమక్షంలో రూ.5,13,362 చెల్లించినట్లు, ఇందుకు సంబంధించిన తీర్మానం, స్టేట్‌మెంట్‌లు, చెల్లింపు ఆధారాలు తన వద్ద ఉన్నాయని ఆమె వెల్లడించారు.
అయితే డబ్బులు చెల్లించినప్పటికీ ఇంకా నగదు చెల్లించాలంటూ తనను వేధిస్తున్నారని గౌస్య భేగం ఆరోపించారు. ఇంటికి వచ్చి, ఫోన్ కాల్స్ చేస్తూ మానసికంగా ఇబ్బందులకు గురిచేస్తున్నారని తెలిపారు. తనపై పదేపదే గ్రీవెన్స్‌లు ఇవ్వడంతో పాటు పోలీస్ స్టేషన్‌కు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ వ్యవహారంపై హసీనా, సుభాషిణికి కోర్టు ద్వారా నోటీసులు పంపించినప్పటికీ ఇప్పటివరకు వారి నుంచి ఎలాంటి సమాధానం రాలేదని గౌస్య భేగం తెలిపారు. అంతేకాకుండా కొంతమంది వ్యక్తుల ద్వారా ఫోన్ కాల్స్ చేయించి తనను బెదిరింపులకు గురిచేస్తున్నారని ఆరోపించారు.
తన వద్ద ఉన్న చెల్లింపు ఆధారాలు, తీర్మానాలు, స్టేట్‌మెంట్‌లను అధికారుల ముందు సమర్పించేందుకు సిద్ధంగా ఉన్నానని గౌస్య భేగం తెలిపారు. తనకు న్యాయం చేయడంతో పాటు వేధింపులు, బెదిరింపుల నుంచి రక్షణ కల్పించాలని ఆమె అధికారులను కోరారు. సీ.వో ఆదినారాయణ కు ఈ గ్రూపులకు ఎటువంటి సంబంధం లేదని గ్రీవెన్స్ లో పెడుతున్నారని తెలిపారు.




