Guntur: జాతీయ యోగ పోటీలకు గుంటూరు గురుకుల విద్యార్థులు

Guntur: నెల్లూరులో జరిగిన రాష్ట్రస్థాయి యోగా పోటీల్లో ప్రతిభ కనబరిచిన గుంటూరు గురుకుల విద్యార్థులు జార్ఖండ్‌లో జరిగే జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారు.

B RAJENDRA, GUNTUR TOWN
Published on: 12 Oct 2026 3:22 PM IST
Guntur
X

Guntur: జాతీయ యోగ పోటీలకు గుంటూరు గురుకుల విద్యార్థులు

Guntur: ఆంధ్రప్రదేశ్ గురుకుల పాఠశాల నందివెలుగు రోడ్డు, గుంటూరు కు చెందిన విద్యార్థులు ఈనెల 10, 11 వ తేదీలలో నెల్లూరు జిల్లా కావలి యందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యోగ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన యోగాసనా ఛాంపియన్షిప్ -2026 రాష్ట్రస్థాయి పోటీలలో మా పాఠశాల విద్యార్థులు పదో తరగతి చెందిన షేక్.జి. అబ్దుల్ ముబారక్, కే.రవీంద్రనాథ్ ఠాగూర్ చక్రవర్తి ఉత్తమ ప్రతిభ కనబరిచి డిసెంబర్ 26,27,28 వ తేదీలలో జార్ఖండ్ రాష్ట్రం, ధన్బాద్ నగరంలో ఇండియన్ యోగ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరగబోతున్న యోగాసనా ఛాంపియన్షిప్- 2026 జాతీయ స్థాయి పోటీలలో పాల్గొంటారని ప్రిన్సిపాల్ ఎం. రజని ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులకు తర్ఫీదు ఇచ్చిన PET ఆర్. శ్రీనివాసులు ను, విద్యార్థులను ప్రిన్సిపాల్ , ఉపాధ్యాయ సిబ్బంది అభినందించారు.

B RAJENDRA, GUNTUR TOWN

B RAJENDRA, GUNTUR TOWN