Guntur: గుంటూరులో అందమైన 8 ప్రాంతాల్లో 'ఐ లవ్ గుంటూరు' బోర్డుల ఏర్పాటు
Guntur: గుంటూరు నగరంలో ప్రధాన జంక్షన్లు, ప్రవేశ మార్గాల వద్ద 8 ప్రాంతాల్లో 'ఐ లవ్ గుంటూరు', 'మన గుంటూరు' బోర్డుల ఏర్పాటు. వెల్లడించిన కమిషనర్ కె. మయూర్ అశోక్.
Guntur: గుంటూరులో అందమైన 8 ప్రాంతాల్లో 'ఐ లవ్ గుంటూరు' బోర్డుల ఏర్పాటు
గుంటూరు: గుంటూరు నగర సౌందర్యీకరణలో భాగంగా నగర పాలక సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. నగరాన్ని మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దేందుకు, పౌరుల్లో నగరంపట్ల ప్రేమను, గర్వాన్ని పెంపొందించేందుకు 8 ప్రధాన ప్రాంతాల్లో "ఐ లవ్ గుంటూరు" (I ❤️ GUNTUR) మరియు "మన గుంటూరు" స్వాగత/ఆహ్వాన బోర్డులను ఏర్పాటు చేస్తున్నట్లు నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ వెల్లడించారు .
నగర ప్రవేశ రహదారులు, ప్రధాన జంక్షన్లు, మరియు నిత్యం రద్దీగా ఉండే ప్రాంతాలను ఎంపిక చేసి ఈ బోర్డులను ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేశారు .
ఆహ్వాన బోర్డులను గాంధీ పార్క్ గేట్ వద్ద (తొలుతగా ప్రారంభం), పొన్నూరు రోడ్ ప్రవేశ మార్గం "గుంటూరు - చిల్లీస్ సిటీ ఆఫ్ ఇండియా" పేరుతో ప్రత్యేక ఆహ్వాన బోర్డు, ఆటో నగర్ వై-జంక్షన్, నంది వెలుగు ROB మానస సరోవర్ పార్క్ వద్ద, గుజ్జనగుండ్ల జంక్షన్, అమరావతి రోడ్, కోరిటెపాడు పార్క్ జంక్షన్ల వద్ద ఏర్పాటు చేయనున్నామన్న కమిషనర్ ..
ఈ బోర్డులు నగరానికి వచ్చే సందర్శకులకు, స్థానిక ప్రజలకు ఆహ్లాదకరమైన అనుభూతిని అందించడమే కాకుండా, సెల్ఫీ పాయింట్లుగా మరియు నగర గుర్తింపు చిహ్నాలుగా నిలుస్తాయని కమిషనర్ పేర్కొన్నారు




