Guntur: సెయింట్ ఆన్స్ కాలేజీలో అంతర్జాతీయ బాలికా దినోత్సవం

Guntur: గుంటూరు సెయింట్ ఆన్స్ కాలేజీలో అంతర్జాతీయ బాలికా దినోత్సవం నిర్వహించారు. బాల్య వివాహాల నిర్మూలన, బాలికల హక్కులపై అధికారులు అవగాహన కల్పించారు.

B RAJENDRA, GUNTUR TOWN
Published on: 9 Oct 2026 9:16 PM IST
Guntur
X

Guntur: సెయింట్ ఆన్స్ కాలేజీలో అంతర్జాతీయ బాలికా దినోత్సవం

గుంటూరు: అమరావతి రోడ్డు నందలి సెయింట్ ఆన్స్ జూనియర్ కాలేజీ ఫర్ గర్ల్స్ నందు “అంతర్జాతీయ బాలికా దినోత్సవము” ను జిల్లా మహిళా మరియు శిశు అభివృద్ధి సంస్థ, జిల్లా బాలల రక్షణ విభాగం మరియు చైల్డ్ రైట్స్ అడ్వకేసి ఫౌండేషన్ - క్రాఫ్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించడమైనది.

ఈ కార్యక్రమములో పి.పి.జి ప్రసూన, జిల్లా మహిళా & శిశు సంక్షేమ సాధికారిక అధికారి వారు మాట్లాడుతూ బాల్య వివాహాలను అంతం చేద్దాం మరియు బాలికల హక్కులు, విద్యలో పెట్టుబడి పెడదాం అని పిలుపునిచ్చారు. సమాజంలో బాలికలు ఎదుర్కొంటున్న లింగ అసమానతలు, వివక్షతపై అవగాహన పెంచడం, బాలికలపై జరిగే వేధింపులు వాటి అనర్థాలను నివారించి, వారి సంపూర్ణ హక్కులను వారు పొందుకునే విధంగా చేయడం ఈ దినోత్సవ ముఖ్య ఉద్దేశమని, బాలికలు, యువతులు వారి వారి రంగాలలో ప్రచారం, పరిశోధనలకు సంబంధించి సాధించిన అభివృద్ధిని ప్రతిబింబించేలా చేయాలని కోరారు. అలాగే తక్కువ ఖర్చుతో ఎక్కువ పోషక విలువ కలిగిన ఆహార పదార్థాల గురించి అవగాహన కల్పించారు.

ఈ సమావేశంలో జె. వాణి గర్ల్స్ చైల్డ్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ మాట్లాడుతూ బాలికల వాయిస్‌లను పెంచే విధంగా, బాలికల ఆధికారాన్ని సాధించే విధంగా, వారి భవిష్యత్తును మెరుగుపరచడానికి అందరం పని చేయాలని, కుటుంబాలలో, సమాజంలో ప్రతి ఒక్కరు బాలికల ఆలోచనలు, అభిప్రాయాలు తీసుకొని దానికి అనుగుణంగా వారి అభివృద్ధి కోసం ప్రణాళికలు తయారు చేయాలని కోరారు. బాలలకు ఏమైనా ఇబ్బందులు ఎదురైతే చైల్డ్ హెల్ప్ లైన్ నెంబర్స్ 1098, డయల్ 100, ఉమెన్ హెల్ప్ లైన్ నెంబర్ 181, 112, గురించి అవగాహన కల్పించారు.

ఈ కార్యక్రమములో డాక్టర్ ఏ. శ్రీవల్లి డిస్టిక్ ఇమునైజేషన్ ఆఫీసర్ మాట్లాడుతూ అబ్బాయిల మాదిరిగానే అమ్మాయిలను కూడా సమానంగా పెంచితే సమాజం మెరుగ్గా ఉంటుందని, బాలికలు ఎదుర్కొంటున్న లింగ అసమానతలు విద్య, పోషణ, చట్టపరమైన హక్కులు, వైద్య సంరక్షణ, రక్షణ, హింస, బలవంతపు బాల్య వివాహలు, వివక్షతపై అవగాహన పెంచడం ఈ దినోత్సవ ముఖ్య ఉద్దేశం అని, బాలికలకు అవకాశం ఇస్తే అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. బాలికల అభివృద్ధి కోసం అందరం కలిసి పనిచేయాలని కోరారు. బాలికలను విద్యావంతులను చేసి, బాల్య వివాహాలు తగ్గించడంలో, విద్యను అభ్యసించిన బాలికలు అధిక వేతనాలతో ఉద్యోగాలు పొందడంలో మార్గదర్శకంగా నిలవడం ద్వారా మహిళ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి అవకాశం కల్పించాలని కోరారు.

ఈ కార్యక్రమములో సమావేశంలో కె. తరంగిణి సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ నగరంపాలెం మాట్లాడుతూ బాలికలు ఫేస్ బుక్ , వాట్సాప్, ఇంస్టాగ్రామ్, దూరంగా ఉండాలని, బాల బాలికలు ఫోన్ కానీ, కంప్యూటర్ కానీ విద్య సంబంధమైన విషయాలు కాకుండా సోషల్ మీడియా గేమ్స్ వంటి వాటి జోలికి పోకూడదని ఒకవేళ మీరు సోషల్ మీడియా యాప్స్ వాడుతున్నట్లయితే జాగ్రత్తలు తీసుకోవాలి అపరిచితులతో ఆన్లైన్ యాప్ లో స్నేహం చేయకూడదు. రకరకాల యాప్స్ డౌన్ లోడ్ చేసుకునే ముందు తల్లిదండ్రులు తో చర్చించి చేసుకోవలెనని తెలిపారు.

సి. హెచ్. విజయ్ కుమార్, జిల్లా బాలల పరిరక్షణాధికారి, గుంటూరు వారు బాల్య వివాహ నిషేధిత చట్టము మరియు POCSO చట్టము గురించి అవగాహన కలిగించారు.

ఈ కార్యక్రమమునకు పి.పి.జి ప్రసూన, జిల్లా మహిళా & శిశు సంక్షేమ సాధికారిక అధికారి , గుంటూరు, టి. శ్రీవాణి, డిస్ట్రిక్ట్ మిషన్ కొ-ఆర్డినేటర్, శ్రీ సి. హెచ్. విజయ్ కుమార్, జిల్లా బాలల పరిరక్షణాధికారి, సిస్టర్ విమలా మేరీ, ప్రిన్సిపల్, సెయింట్ ఆన్స్ జూనియర్ కాలేజీ, జె. వాణీ, గర్ల్ చైల్డ్ డెవలప్మెంట్ ఆఫీసర్, డాక్టర్ ఏ. శ్రీవల్లి డిస్టిక్ ఇమునైజేషన్ ఆఫీసర్, ప్రియాంక, మెడికల్ ఆఫీసర్, కె. తరంగిణి సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ నగరంపాలెం, ఎం . మాధురి, లేబర్ ఆఫీసర్, శ్రీ జి. వెంకట్, కో -ఆర్డినేటర్, కె. శాంతి భూషణ గోపి, సెంటర్ అడ్మినిస్ట్రేటర్, వన్ స్టాప్ సెంటర్ మొదగలగు వారు పాల్గొన్నారు.

B RAJENDRA, GUNTUR TOWN

B RAJENDRA, GUNTUR TOWN