Guntur: గుంటూరు జనసేనలో మొదలైన అసంతృప్తి సెగలు
Guntur: గుంటూరు జిల్లా జనసేనలో అసంతృప్తి భగ్గుమంది. పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేస్తున్న సీనియర్లకు కమిటీల్లో చోటు దక్కకపోవడంపై కేడర్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తోంది.
Guntur: గుంటూరు జనసేనలో మొదలైన అసంతృప్తి సెగలు
Guntur: గుంటూరు జనసేనలో మొదలైన అసంతృప్తి సెగలు. పార్టీ అధిష్ఠానం తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్న సీనియర్ జనసైనికులు.
తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్న గుంటూరు పశ్చిమ నాయకుడు ఆళ్ల హరి, ప్రత్తిపాడుకు చెందిన కాటూరి శ్రీను మాస్టారు ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతోమంది జన సైనికులకు తీవ్ర అన్యాయం జరిగింది.
స్థానిక సంస్థల ఎన్నికల వేళ జనసేన ప్రకటించిన కమిటీల్లో దక్కని చోటు. మూడు రోజుల క్రితం విడుదల చేసిన పార్లమెంట్ జాబితాలో కనిపించని పేర్లు.
జిల్లా పార్లమెంట్ జాబితాలో కనీసం పార్టీలో కనిపించని వారికి జాబితాలో చోటు దక్కింది. తాజాగా విడుదలైన నియోజకవర్గాల కమిటీల జాబితాలోనూ ఎటువంటి బాధ్యతలు దక్కకపోవడంపై ఆవేదన.
"మాకు నామినేటెడ్ పదవులు అవసరం లేదు.. పార్టీ కోసం చేసిన సేవలను గుర్తిస్తే చాలు" అంటున్న సీనియర్లు. పార్టీ ఆవిర్భావం నుంచి అధినేత పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు పనిచేస్తున్న వారిని విస్మరించారంటూ ఆవేదన.
జిల్లా, నియోజకవర్గాల్లో పార్టీ కార్యక్రమాలను భుజాన ఎత్తుకున్న కీలక నేతల పేర్లు లేకపోవడం పై కేడర్‌లో విస్మయం. కష్టపడి పనిచేసిన వారికి తగిన గుర్తింపు దక్కడం లేదంటూ తీవ్ర చర్చల్లో మునిగిన జిల్లా జనసేన నాయకులు, కార్యకర్తలు.




