Guntur: విద్యార్థులకు ఉన్నత ఆశయాలపై ప్రేరణ కల్పించాలి

Guntur: గుంటూరులో జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ విద్యాశాఖ అధికారులతో సమీక్ష జరిపారు. విద్యార్థులకు ఉన్నత ఆశయాలపై ప్రేరణ కల్పించాలని ఆదేశించారు.

B RAJENDRA, GUNTUR TOWN
Published on: 9 Oct 2026 4:09 PM IST
Guntur
X

Guntur: విద్యార్థులకు ఉన్నత ఆశయాలపై ప్రేరణ కల్పించాలి

గుంటూరు: ఉన్నత ఆశయాల సాధనకు విద్యార్థులకు ప్రేరణ కల్పించాలని జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ అన్నారు. విద్యా శాఖ అధికారులతో జాయింట్ కలెక్టర్ శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలో వివిధ అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరు శత శాతం ఉండాలని అన్నారు. విద్యార్థులను షైనింగ్ స్టార్ లు, రైసింగ్ స్టార్ లు గా ఇప్పటికే గుర్తించడం జరిగిందని చెప్పారు.

రైసింగ్ స్టార్ లు షైనింగ్ స్టార్ లుగా ఎదగాలని స్పష్టం చేశారు. ఇందుకు సరైన ప్రేరణ కల్పించాలని సూచించారు. ఆశయ సాధన పట్ల స్పష్టమైన అవగాహన కల్పించడం వలన స్వయం ప్రేరణ పొందుతారని, తద్వారా మంచి ఫలితాలు అవుతాయన్నారు. ప్రేరణాత్మక కథనాలు తెలియజేయాలని అన్నారు. ప్రతీ ఒక్కరూ షైనింగ్ స్టార్ హీరోలు కావడానికి ఉపాధ్యాయులు తమ అనుభవాలను ఉపయోగించాలని చెప్పారు.

ప్రతీ విద్యార్థి అభ్యసన సూత్రాల్లో వెనుకబడకుండా పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. విద్యార్థి మానసిక స్థితిని ఉపాధ్యాయులు అంచనా వేసి అందుకు అనుగుణంగా బోధన చేయాలని ఆదేశించారు. విద్యార్థిని తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయులు కృతాకృత్యులు కావడంలోనే సంతృప్తి కలుగుతుందని చెప్పారు. ఉన్నత ఆశయాల సాధనకు విలువలతో కూడిన విద్యను అందించాలని అన్నారు.

ఉన్నత లక్ష్యాలను ఎవరైనా సాధించగలరనే నమ్మకం కల్పిస్తూ అందుకు ఏ విధంగా సిద్ధం కావాలో తెలియజేయాలని అన్నారు. బడి బయట చిన్నారులు ఉండరాదని స్పష్టం చేశారు. బడి ఈడు గల పిల్లలు బడిలోనే ఉండాలని అన్నారు. అంగన్వాడీ నుండి ప్రాథమిక పాఠశాలలు, ప్రాథమిక పాఠశాలలు నుండి ఉన్నత పాఠశాలలు అచ్చట నుండి కళాశాలలు వరకు చేరికలనూ గమనించాలని ఆదేశించారు. మౌలిక వసతుల లోపాలు లేకుండా చూడాలని చెప్పారు. శిథిల భవనాలలో తరగతులు నిర్వహించకుండా పర్యవేక్షణ చేయాలని, అటువంటి భవనాలు ఉంటే నివేదికలు సమర్పించాలని అన్నారు. ఆటిజం కేంద్రాలు అన్ని నెలాఖరుకు ప్రారంభం కావాలని స్పష్టం చేశారు. పి.యం.శ్రీ పాఠశాలల్లో జరిగిన పనులకు బిల్లులు అప్ లోడ్ చేయాలని ఆదేశించారు.

జిల్లా విద్యా శాఖ అధికారి డా.షేక్ సలీం భాషా మాట్లాడుతూ వెనుకబడిన విద్యార్థులను బ్లూమింగ్ స్టార్ లుగా వర్గీకరణ చేసి ప్రత్యేక తర్ఫీదు ఇస్తున్నట్లు తెలిపారు. ఆటిజం కేంద్రాలలో రెండు ఈ నెలాఖరుకు పూర్తి అవుతుందని, ఇప్పటికే రెండు పూర్తి అయ్యాయని చెప్పారు. జిల్లాలో మొత్తం ఐదు కేంద్రాలు ఉన్నాయని తెలిపారు. శిథిలావస్థలో ఉన్న ఎనిమిది తరగతి గదులు తొలగించడం జరిగిందని, మరో 84 వరకు గుర్తించడం జరిగిందని వివరించారు. ఈ సమావేశంలో ఉప విద్యా శాఖ అధికారులు, మండల విద్యా శాఖ అధికారులు పాల్గొన్నారు.

B RAJENDRA, GUNTUR TOWN

B RAJENDRA, GUNTUR TOWN