Guntur: ఎన్నికలు పారదర్శకంగా జరగాలి: జేసీ అశుతోష్ శ్రీవాస్తవ

Guntur: గుంటూరు జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలను నిష్పక్షపాతంగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ అధికారులను ఆదేశించారు.

AVINASH, GUNTUR CITY
Published on: 15 Oct 2026 4:54 PM IST
Guntur
X

Guntur: ఎన్నికలు పారదర్శకంగా జరగాలి: జేసీ అశుతోష్ శ్రీవాస్తవ

గుంటూరు: స్థానిక సంస్థల ఎన్నికలు పారదర్శకంగా, ప్రశాంతంగా నిర్వహించుటకు అన్ని చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ అన్నారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో రిటర్నింగ్ అధికారులకు గురువారం జరిగిన శిక్షణ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణ బాధ్యత రిటర్నింగ్ అధికారులదని అన్నారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాలు స్పష్టంగా అవగాహన పొంది, ఎటువంటి పొరపాట్లకు తావులేకుండా నిబంధనలు అమలు చేయాలని ఆదేశించారు. రిటర్నింగ్ అధికారుల స్థాయిలో స్టాటిక్ టీమ్ లు, సర్వేలియన్స్ టీములు, ఫ్లయింగ్ స్క్వాడ్ లు, ఖర్చుల పరిశీలన బృందాలను నియామకం పూర్తి చేసి, పర్యవేక్షణ చేయాలని అన్నారు.

అభ్యర్థులు చేసిన ప్రతి పైసా జమ కావాలని చెప్పారు. అభ్యర్థులు సమావేశాలు, ర్యాలీలు నిర్వహణకు ముందస్తు అనుమతి పొందాలని అన్నారు. మీడియాలో ప్రకటనలు ప్రచురితమైతే వాటిని ఖర్చులు క్రింద లెక్కించడం జరుగుతుందని తెలిపారు. స్టాట్యూటరీ, స్టాట్యూటరీ కాని అంశాలు పట్ల స్పష్టమైన అవగాహన ఉండాలని చెప్పారు. పోలింగ్ కేంద్రాల పరిశీలన, పోలింగ్ నిర్వహణ, లెక్కింపు విధానాల పట్ల అతి జాగ్రత్తగా వ్యవహరించాలని చెప్పారు.

ఎన్నికల నియమావళి అమలు చేయాలి. ఎన్నికల నియమావళి అమలు పక్కాగా చేయాలని జాయింట్ కలెక్టర్ ఆదేశించారు. స్టాటిక్ టీమ్ లు, సర్వేలియన్స్ టీములు, ఫ్లయింగ్ స్క్వాడ్ లు, ఖర్చుల పరిశీలన బృందాలతో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జాయింట్ కలెక్టర్ గురువారం సమీక్షించారు. ఎన్నికల నియమావళి అమలు చేయాలని, ప్రతీ రోజూ ఖర్చులు జమ చేసి, కంట్రోల్ రూమ్ కు అందజేయాలని ఆదేశించారు.

ఈ సమావేశంలో జిల్లా రెవిన్యూ అధికారి ఎన్.ఎస్.కె.ఖాజావలి, డిప్యూటీ కలెక్టర్ లు గంగ రాజు, లక్ష్మి కుమారి, శ్రీనివాస్, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి వి.జ్యోతి బసు, జిల్లా విద్యా శాఖ అధికారి డా.షేక్ సలీం భాషా, వ్యవసాయ మార్కెటింగ్ శాఖ సహాయ సంచాలకులు సత్యనారాయణ చౌదరి, మార్క్ ఫెడ్ జిల్లా మేనేజర్ టి. నరసింహా రెడ్డి, సమాచార పౌర సంబంధాల శాఖ ఉప సంచాలకులు లోచర్ల రమేష్,రిటర్నింగ్ అధికారులు, సహాయ రిటర్నింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

AVINASH, GUNTUR CITY

AVINASH, GUNTUR CITY