Guntur: కొర్నిపాడు పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించిన జేసీ అశుతోష్ శ్రీవాస్తవ!

Guntur: వట్టిచెరుకూరు మండలం కొర్నిపాడు పోలింగ్ కేంద్రాన్ని గుంటూరు జేసీ అశుతోష్ శ్రీవాస్తవ తనిఖీ చేశారు. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు.

B RAJENDRA, GUNTUR TOWN
Published on: 18 Oct 2026 8:01 AM IST
Guntur
X

Guntur: కొర్నిపాడు పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించిన జేసీ అశుతోష్ శ్రీవాస్తవ!

Guntur: గుంటూరు, వట్టిచెరుకూరు మండలం కొర్నిపాడు పోలింగ్ కేంద్రాన్ని జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ శనివారం తనిఖీ చేశారు. జిల్లాలో ప్రశాంతంగా, సజావుగా ఎన్నికల నిర్వహణకు చర్యలు చేపడుతున్నామని జాయింట్ కలెక్టర్ చెప్పారు. ఇందులో భాగంగా సున్నిత, అతి సున్నిత పోలింగ్ కేంద్రాలను, సమస్యాత్మక కేంద్రాలను కూడా గుర్తించడం జరుగుతుందని అన్నారు. ప్రజలందరూ శాంతియుత వాతావరణంలో ఎన్నికల నిర్వహణకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

సమస్యలు ఉంటే ముందే జిల్లా ఎన్నికల యంత్రాంగానికి తెలియజేయాలని తద్వారా వాటిని తక్షణం పరిష్కరించుటకు చర్యలు చేపడతామని తెలిపారు. చక్కని వాతావరణంలో ప్రశాంతంగా ఎన్నికలు జరిగి ఆదర్శ ఆదర్శవంతంగా జిల్లా నిలవాలని అన్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనలను గుర్తించినా, ఎన్నికలకు సంబంధించి ఏవైనా సందేహాలు లేదా ప్రశ్నలు ఉన్నా, వాటిపై ఫిర్యాదులు చేసేందుకు లేదా వివరాలు తెలుసుకునేందుకు 08632 234014 హెల్ప్‌డెస్క్/కాల్ సెంటర్ ఫోన్ నంబర్‌ను సంప్రదించవచ్చని వివరించారు.

ప్రతి పోలింగ్ కేంద్రంలో ప్రాథమిక సౌకర్యాలు ఉండాలని మండల అధికారులను ఆదేశించారు. విద్యుత్తు, సీసీ కెమెరాలు, వెబ్ కాస్టింగ్ తదితర అంశాలపట్ల స్పష్టమైన అవగాహన ఉండాలని చెప్పారు. వార్డుల వారీగా పోలింగ్ బూతులు ఏర్పాటు పక్కాగా ఉండాలని సూచించారు. ఎన్నికల నిర్వహణకు వచ్చే సిబ్బందికి సమస్యలు లేకుండా ముందస్తు ఏర్పాట్లు చేయాలని పేర్కొన్నారు. ఎన్నికల నిర్వహణ పట్ల ఎక్కడా నిర్లక్ష్యం వహించరాదని అధికారులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ వి.శంకర్, మండల అధికారులు పాల్గొన్నారు.

B RAJENDRA, GUNTUR TOWN

B RAJENDRA, GUNTUR TOWN