Guntur: కాకుమానులో రాజకీయ పార్టీల ప్రతినిధులతో అధికారుల భేటీ!
Guntur: గుంటూరు జిల్లా కాకుమాను మండల పరిషత్ కార్యాలయంలో గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణపై ఎంపీడీవో, తహశీల్దార్ ఆధ్వర్యంలో శుక్రవారం అఖిలపక్ష సమావేశం నిర్వహించారు.
Guntur: కాకుమానులో రాజకీయ పార్టీల ప్రతినిధులతో అధికారుల భేటీ!
గుంటూరు: గ్రామ పంచాయతీ ఎన్నికలు–2026 నిర్వహణకు సంబంధించి కాకుమాను మండల పరిషత్ కార్యాలయంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారి మరియు తహశీల్దార్ గారి ఆధ్వర్యంలో మండలంలోని అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించడం జరిగింది.
ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించిన గ్రామ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్లో భాగంగా మూడవ విడత ఎన్నికల కార్యక్రమాల వివరాలను రాజకీయ పార్టీల ప్రతినిధులకు తెలియజేయడం జరిగింది.
ఎన్నికల నోటిఫికేషన్:19.11.2026
పోలింగ్ : 02.12.2026 న ఉంటుండని తెలియ చేసారు. ఇటీవల నిర్వహించిన MPTC/ZPTC ఎన్నికలు ప్రశాంతంగా, సజావుగా జరిగేందుకు అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు అందించిన సహకారాన్నికి మండల పరిషత్ అభివృద్ధి అధికారి గారు కృతజ్ఞతలు తెలియ చేసారు. అదే స్ఫూర్తితో రాబోయే గ్రామ పంచాయతీ ఎన్నికలు కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా ప్రశాంత వాతావరణంలో, స్వేచ్ఛగా మరియు నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు అన్ని రాజకీయ పార్టీల నాయకులు, ప్రతినిధులు, అభ్యర్థులు మరియు ప్రజలు ఎన్నికల నియమావళిని తప్పనిసరిగా పాటిస్తూ అధికార యంత్రాంగానికి పూర్తి సహాయ సహకారాలు అందించాలని మండల పరిషత్ అభివృద్ధి అధికారి గారు కోరారు.




