Guntur: వైజర్ సమ్మర్ ప్రోగ్రామ్‌లో క్వాంటమ్ ఎలైట్గా చైత్ర దీపిక ఎంపిక!

Guntur: గుంటూరు జిల్లా వింజనంపాడు కిట్స్ కళాశాల విద్యార్థిని గంట చైత్ర దీపిక 'వైజర్ గ్లోబల్ సమ్మర్ ప్రోగ్రామ్'లో 'క్వాంటమ్ ఎలైట్'గా ఎంపికయ్యారు.

ANANDBABU,	PRATTIPADU
Published on: 1 Oct 2026 11:48 AM IST
Guntur
X

Guntur: వైజర్ సమ్మర్ ప్రోగ్రామ్‌లో క్వాంటమ్ ఎలైట్గా చైత్ర దీపిక ఎంపిక!

Guntur: గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం లో వింజనంపాడులోని కేకేఆర్ అండ్ కేఎస్‌ఆర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ (కిట్స్) లో బీటెక్ తృతీయ సంవత్సరం చదువుతున్న గంట చైత్ర దీపిక ప్రతిష్టాత్మక వైజర్ గ్లోబల్ సమ్మర్ ప్రోగ్రామ్–2026’లో విశేష ప్రతిభ కనబరిచి క్వాంటమ్ ఎలైట్’గా ఎంపికయ్యారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఈ కార్యక్రమానికి ప్రపంచవ్యాప్తంగా 33 దేశాల నుంచి 64,436 మంది నమోదు చేసుకోగా, వివిధ దశల ఎంపిక పక్రియ అనంతరం 3,117 మంది తదుపరి దశకు చేరుకున్నారు. క్వాంటమ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సాగిన తొమ్మిది నెలల ఈ కార్యక్రమంలో క్వాంటమ్ అల్గారిథమ్స్, ప్రాక్టికల్ లెర్నింగ్, ఇండస్ట్రీ ఛాలెంజ్‌లు, మెంటర్‌షిప్ తదితర అంశాల్లో విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ అందించారు.

ఈ కార్యక్రమంలో ప్రతిభ ఆధారంగా 108 మంది విద్యార్థులను షార్ట్‌లిస్ట్ చేయగా, వారిలో కేవలం 10 మందిని ‘క్వాంటమ్ ఎలైట్’గా ఎంపిక చేశారు. ఈ అత్యంత ప్రతిష్టాత్మక ఎంపికలో కిట్స్ విద్యార్థిని చైత్ర దీపిక స్థానం సంపాదించడం కళాశాలకు గర్వకారణంగా నిలిచింది.

ఈ క్వాంటమ్ ఎలైట్ కార్యక్రమంలో భాగంగా పరిశ్రమల్లో ఎదురవుతున్న వాస్తవ సమస్యలను గుర్తించి, వాటికి క్వాంటమ్ టెక్నాలజీ ద్వారా వినూత్న పరిష్కారాలను అభివృద్ధి చేయడంపై విద్యార్థులకు అవకాశం కల్పించారు.

ఈ క్రమంలో చైత్ర దీపిక రూపొందించిన క్వాంటమ్‌ఫ్లో ఇంటెలిజెంట్ ఆర్డర్ ఆప్టిమైజేషన్ ప్రాజెక్ట్ను కార్యక్రమంలో ప్రదర్శించబడింది. క్వాంటమ్ కంప్యూటింగ్‌ను ఉపయోగించి ఆర్డర్ ఆప్టిమైజేషన్ సమస్యలకు సమర్థవంతమైన పరిష్కారాలను అందించే విధంగా రూపొందించిన ఈ ప్రాజెక్ట్ చైత్ర దీపిక సాంకేతిక ప్రతిభ, సృజనాత్మక ఆలోచనా విధానాన్ని ప్రతిబింబించింది.

ప్రపంచవ్యాప్తంగా 64,436 మంది పాల్గొన్న కార్యక్రమంలో చివరి దశకు ఎంపికైన 10 మంది ‘క్వాంటమ్ ఎలైట్’లో KITS విద్యార్థిని చైత్ర దీపిక చోటు సంపాదించడం విశేష విజయంగా ప్రభుత్వ అధికారులు పేర్కొన్నాయి.

ఈ సందర్భంగా కళాశాల ఛైర్మన్ డాక్టర్ కోయి సుబ్బారావు గారు, కార్యదర్శి శ్రీ కోయి శేఖర్ గారు చైత్ర దీపికను అభినందించారు. క్వాంటమ్ కంప్యూటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి అత్యాధునిక సాంకేతిక రంగాల్లో విద్యార్థులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించడం కిట్స్ కు గర్వకారణమని వారు పేర్కొన్నారు. భవిష్యత్తులో మరిన్ని నూతన సాంకేతిక రంగాల్లో విద్యార్థులను ప్రోత్సహిస్తామని తెలిపారు.

కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పి. బాబు గారు, అకాడమిక్ డైరెక్టర్ డాక్టర్ కె. హరిబాబు గారు, ప్రొఫెసర్ రమేష్గారు, ఇతర అధ్యాపకులు, విద్యార్థులు చైత్ర దీపికను అభినందించి, ఆమె భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.

ANANDBABU,	PRATTIPADU

ANANDBABU, PRATTIPADU