Guntur: గుంటూరులో మేయర్ అభ్యర్థి లక్ష్మీ అపర్ణకు జననీరాజనం!
Guntur: గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి ఆధ్వర్యంలో ఆరు డివిజన్లలో కూటమి మేయర్ అభ్యర్థి కోవెలమూడి లక్ష్మీ అపర్ణ భారీ రోడ్‌షో నిర్వహించారు. ప్రజలు నీరాజనాలు పలికారు.
Guntur: గుంటూరులో మేయర్ అభ్యర్థి లక్ష్మీ అపర్ణకు జననీరాజనం!
గుంటూరు: గుంటూరు నగరంలో కూటమి మేయర్ అభ్యర్థి కోవెలమూడి లక్ష్మీ అపర్ణకు ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యురాలు గల్లా మాధవి ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో లక్ష్మీ అపర్ణ పాల్గొని ప్రజలను ఆత్మీయంగా పలకరిస్తూ కూటమి అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని కోరారు.
నగరంలోని 37, 38, 48, 49, 55, 58వ డివిజన్లలో నిర్వహించిన రోడ్‌షోకు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. 55వ డివిజన్ గుజ్జనగుండ్ల సెంటర్‌లోని ఆంజనేయస్వామి దేవస్థానం నుంచి ప్రారంభమైన ప్రచార ర్యాలీ మిర్చియార్డు వైపు సాగింది. మార్గమధ్యంలో ప్రజలు లక్ష్మీ అపర్ణకు స్వాగతం పలుకుతూ తమ మద్దతు ప్రకటించారు. కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఉత్సాహంగా పాల్గొనడంతో ప్రచార ప్రాంతాల్లో సందడి నెలకొంది.
ఈ సందర్భంగా లక్ష్మీ అపర్ణ మాట్లాడుతూ, ప్రజలు చూపిస్తున్న ఆదరణ, అభిమానం తనకు మరింత బాధ్యతను పెంచుతున్నాయని పేర్కొన్నారు. గుంటూరు నగర సమగ్ర అభివృద్ధి, మెరుగైన మౌలిక సదుపాయాలు, పారిశుధ్యం, ప్రజలకు మెరుగైన పౌర సేవలు అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతామని తెలిపారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తూ నగర అభివృద్ధికి కట్టుబడి ఉంటామని భరోసా ఇచ్చారు.ప్రజల నుంచి లభిస్తున్న స్పందన కూటమి అభ్యర్థుల్లో నూతనోత్సాహాన్ని నింపుతోందని, రానున్న ఎన్నికల్లో ప్రజల మద్దతుతో భారీ విజయం సాధిస్తామనే విశ్వాసం ఉందని కూటమి నేతలు పేర్కొన్నారు.
ప్రచారంలో పాల్గొన్న కూటమి కార్పొరేటర్ అభ్యర్థులు: షేక్ లాల్ అహ్మద్ – జనసేన పార్టీ పరుచూరి సంజీవరావు మానం శ్రీనివాస్ బలిగి సుగుణ దేవి గుండ భవాని,మట్టిపూడి శివలక్ష్మి.




