Guntur: బీఆర్‌ స్టేడియంలో కూటమి మేయర్ అభ్యర్థి లక్ష్మీ అపర్ణ ప్రచారం!

Guntur: గుంటూరు బీఆర్‌ స్టేడియంలో కూటమి మేయర్ అభ్యర్థి లక్ష్మీ అపర్ణ ప్రచారం చేశారు. స్టేడియం అభివృద్ధికి రూ.19 కోట్లు కేటాయించినట్లు తెలిపారు.

B RAJENDRA, GUNTUR TOWN
Published on: 27 Oct 2026 12:25 PM IST
Guntur
X

Guntur: బీఆర్‌ స్టేడియంలో కూటమి మేయర్ అభ్యర్థి లక్ష్మీ అపర్ణ ప్రచారం!

Guntur: గుంటూరు నగర కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎన్డీఏ కూటమి మేయర్ అభ్యర్థి కోవెలమూడి లక్ష్మీ అపర్ణ బీఆర్‌ స్టేడియంలో పర్యటించి, ప్రజలు, క్రీడాకారులు, వాకర్స్‌ను ఆత్మీయంగా పలకరించారు. ఈ సందర్భంగా స్టేడియంలో కొనసాగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, క్రీడాకారులకు కల్పిస్తున్న సౌకర్యాలు, ప్రజలకు అందుబాటులో ఉన్న వసతుల గురించి ఆమె ప్రస్తావించారు.

కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చొరవతో, స్థానిక ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ ఆధ్వర్యంలో బీఆర్‌ స్టేడియం అభివృద్ధికి ప్రాధాన్యత తో బీఆర్‌ స్టేడియంలో వాకింగ్‌ ట్రాక్‌, షటిల్‌, వాలీబాల్‌, బాస్కెట్‌బాల్‌ కోర్టులు, మరుగుదొడ్ల నిర్మాణానికి రూ.5 కోట్ల నిధులు మంజూరయ్యాయని తెలిపారు. ఇప్పటికే కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌ సహకారంతో రూ.14 కోట్లతో మల్టీపర్పస్‌ క్రీడా భవనం నిర్మిస్తున్నామని, బీఆర్‌ స్టేడియాన్ని క్రీడలకు కేంద్రంగా తీర్చిదిద్దుతున్నామని పేర్కొన్నారు.గతంలో చేపట్టిన, ప్రస్తుతం కొనసాగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు కూటమి అభ్యర్థిగా నవంబర్ 1 న సైకిల్ గుర్తుకు ఓటు వేయాలని కోరారు. అలానే స్థానిక కార్పొరేటర్ అభ్యర్థులకు కూడా ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని ఆమె విజ్ఞప్తి చేశారు . ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ అభ్యర్థులు. మాజీ కార్పొరేటర్. మరియు కూటమి నాయకులు పాల్గొన్నారు

B RAJENDRA, GUNTUR TOWN

B RAJENDRA, GUNTUR TOWN