Guntur: ఎమ్మెల్యే నజీర్ అహ్మద్‌ను కలి和 కృతజ్ఞతలు తెలిపిన మేయర్ లక్ష్మీ అపర్ణ
Guntur: గుంటూరు నగర మేయర్‌గా ఘనవిజయం సాధించిన కోవెలమూడి లక్ష్మీ అపర్ణ తూర్పు ఎమ్మెల్యే నజీర్ అహ్మద్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. గుంటూరు అభివృద్ధిపై చర్చ.
Guntur: ఎమ్మెల్యే నజీర్ అహ్మద్‌ను కలి和 కృతజ్ఞతలు తెలిపిన మేయర్ లక్ష్మీ అపర్ణ
గుంటూరు: గుంటూరు నగర మేయర్‌గా అఖండ మెజారిటీతో ప్రజాతీర్పును అందుకున్న లక్ష్మీ అపర్ణ కోవెలమూడి, గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ ని ఆయన కార్యాలయమునందు కలిశారు.
ఎన్నికల సమయంలో ప్రజలతో మమేకమవుతూ, తన విజయానికి విలువైన సహకారం అందించిన నజీర్ అహ్మద్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.
ఈ సందర్భంగా గుంటూరు నగర ప్రజల ఆకాంక్షలు, అభివృద్ధి అవసరాలు, ప్రజలకు మెరుగైన సేవలందించాల్సిన బాధ్యతపై ఇరువురు తమ అభిప్రాయాలను పంచుకున్నారు.
ప్రజలు అందించిన విజయాన్ని బాధ్యతగా స్వీకరిస్తూ.. గుంటూరు అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగాలనే సంకల్పంతో ఈ సమావేశం కొనసాగింది.




