Guntur: గుంటూరు మేయర్‌ రేస్‌లో బిగ్‌ ట్విస్ట్‌.. వైసీపీ అభ్యర్థిగా శ్రీదేవి!

Guntur: గుంటూరు మేయర్ అభ్యర్థి ఎంపికలో వైసీపీ బిగ్ ట్విస్ట్ ఇచ్చింది. తొలి ప్రచారంలో ఉన్న నూరి ఫాతిమా స్థానంలో శ్రీదేవిని ఎంపిక చేసినట్లు ఊహాగానాలు.

B RAJENDRA, GUNTUR TOWN
Published on: 16 Oct 2026 7:39 PM IST
Guntur
X

Guntur: గుంటూరు మేయర్‌ రేస్‌లో బిగ్‌ ట్విస్ట్‌.. వైసీపీ అభ్యర్థిగా శ్రీదేవి!

గుంటూరు: గుంటూరు నగర రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. నగర మేయర్‌ అభ్యర్థిగా వైశ్య సామాజిక వర్గానికి చెందిన శ్రీదేవిని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపిక చేసినట్లు సమాచారం. తొలుత మేయర్‌ అభ్యర్థిగా నూరి ఫాతిమా పేరు ప్రచారంలోకి రాగా, తాజాగా ఆ నిర్ణయంలో మార్పు చోటుచేసుకోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

మేయర్‌ అభ్యర్థి ఎంపికలో చివరి నిమిషంలో చోటుచేసుకున్న ఈ మార్పు నగర రాజకీయాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. సామాజిక సమీకరణాలు, రాజకీయ వ్యూహాల నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నారా అన్న చర్చ సాగుతోంది. అయితే శ్రీదేవి అభ్యర్థిత్వంపై పార్టీ నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

B RAJENDRA, GUNTUR TOWN

B RAJENDRA, GUNTUR TOWN