Guntur: గుంటూరులో వైఎస్సార్‌కు మాజీ హోంమంత్రి సుచరిత ఘన నివాళులు!

Guntur: 41వ డివిజన్‌లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి 17వ వర్ధంతి. వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించి అన్నదానంలో పాల్గొన్న మాజీ హోంమంత్రి మేకతోటి సుచరిత.

ANANDBABU,	PRATTIPADU
Published on: 3 Sept 2026 10:41 AM IST
Guntur
X

Guntur: గుంటూరులో వైఎస్సార్‌కు మాజీ హోంమంత్రి సుచరిత ఘన నివాళులు!

Guntur: గుంటూరు జిల్లా గుంటూరు లో కార్పోరేషన్ పరిధిలోని 41వ డివిజన్, రాజీవ్ గృహకల్ప అపార్ట్మెంట్స్, స్వర్ణభారతి నగర్ నందు కుల, మత, పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరికి సంక్షేమ పధకాలు అందించిన దివంగత మహానేత, రైతు బాంధవుడు, ప్రజల కష్టాలు కడతేర్చి, జనం గుండెల్లో నిలిచిన నాయకులు, రేపటి తరాల ఉన్నతి కోసం అహర్నిశలు పనిచేసిన దార్శనికుడు డా.వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి గారి 17వ వర్ధంతి సందర్భంగా గ్రామంలో గల వై.ఎస్.ఆర్. గారి విగ్రహంనకు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించిన శ్రీమతి మేకతోటి సుచరిత గారు, మాజీ హోం మంత్రివర్యులు, పార్టీ సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యులు. అనంతరం గ్రామ ప్రజలు ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో స్థానిక వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలసి పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో పిల్లి మేరీ గారు, మాజీ స్టేట్ డైరెక్టర్ ఆర్&బి, వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, వివిధ అనుబంధ విభాగాల నాయకులు, గ్రామ నాయకులు, వై.యస్.ఆర్.అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ANANDBABU,	PRATTIPADU

ANANDBABU, PRATTIPADU

Next Story