Guntur: గుంటూరులో పనిచేసే మహిళల కోసం మొబైల్ క్రెష్ కేంద్రాలు

Guntur: గుంటూరులో పనిచేసే నిరుపేద మహిళల కోసం మెప్మా, మొబైల్ క్రెచెస్ సంయుక్తంగా 0-3 ఏళ్ల చిన్నారుల సంరక్షణకు 3 క్రెష్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాయి.

B RAJENDRA, GUNTUR TOWN
Published on: 6 Oct 2026 9:23 PM IST
Guntur
X

Guntur: గుంటూరులో పనిచేసే మహిళల కోసం మొబైల్ క్రెష్ కేంద్రాలు

Guntur: పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ మరియు మొబైల్ క్రషర్స్ సంయుక్తంగా నిర్మించబోతున్న పట్టణాలైనా విజయవాడ తిరుపతి విశాఖపట్నం తో పాటు గుంటూరులో కూడా సహాయక పేద మహిళలకు వారి కుటుంబ సభ్యులకు మరియు ముఖ్యంగా పనిచేసే మహిళలకు ఈ క్రిష్ సెంటర్లో ఉపయోగకరంగా ఉండాలని 0 ట్టు 3 వయసు గల పిల్లలకు ఈ క్రిష్ సెంటలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని గుంటూరు నగరపాలక కమిషన్ ఆధ్వర్యంలో 3 క్రష్ సెంటర్లో గుర్తించటం అయినది వాటిని సమర్ధవంతంగా నిర్వహించుటకు ఆ ప్రాంతపు పరిధిలో ఉన్న SHG సభ్యులకు ఒక్కొక్క సెంటర్కు ముగ్గురు సభ్యులు చొప్పున గుంటూరు పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ పీడీ వారి ఆధ్వర్యంలో మొబైల్ క్రషర్స్ సంస్థతో 8 రోజులు పాటు శిక్షణ నిర్వహించారు.

త్వరలో ఎండి ఆధ్వర్యంలో పైలెట్ ప్రాజెక్టుగా మూడిట్లో ఒక సెంటర్ ని ప్రారంభించుటకు ఏర్పాట్లు జరుగుచున్నవి దీంట్లో భాగంగా గుంటూరు పట్టణ ప్రాంతాల్లో మొబైల్ క్రెచెస్ కేంద్రాల గుర్తింపు, ఏర్పాటు మరియు నిర్వహణకు సంబంధించి MEPMA ప్రాజెక్ట్ డైరెక్టర్ విజయలక్ష్మి ని IMC Securities India Pvt. Ltd. ప్రతినిధులు కరోలినా బ్రోజోవ్స్కా, సనా, Mobile Creches ప్రతినిధులు గర్వ్ నగర్, సాయి కృష్ణ కలిసి కృతజ్ఞతలు తెలిపారు.

మొబైల్ క్రెచెస్ కేంద్రాల ఏర్పాటుకు MEPMA అధికారులు అందిస్తున్న నిరంతర సహకారం, సమన్వయం మరియు మార్గదర్శకత్వాన్ని ప్రతినిధులు అభినందించారు. చిన్నారులకు సురక్షితమైన, నాణ్యమైన బాలల సంరక్షణ సేవలను అందించేందుకు సంబంధిత సంస్థల సమన్వయంతో కార్యక్రమాన్ని మరింత సమర్థవంతంగా కొనసాగించనున్నట్లు తెలిపారు.

B RAJENDRA, GUNTUR TOWN

B RAJENDRA, GUNTUR TOWN