Guntur: కన్నా లక్ష్మీనారాయణను పరామర్శించిన ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర

Guntur: సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణను పరామర్శించిన పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర. శస్త్రచికిత్స అనంతరం త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష.

B RAJENDRA, GUNTUR TOWN
Published on: 20 Sept 2026 10:56 PM IST
Guntur
X

Guntur: కన్నా లక్ష్మీనారాయణను పరామర్శించిన ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర

గుంటూరు: శస్త్రచికిత్స చేయించుకొని ఇటీవల ఇంటికి చేరుకున్న సత్తెనపల్లి శాసనసభ్యులు, మాజీ మంత్రివర్యులు కన్నా లక్ష్మీనారాయణ ని పొన్నూరు శాసనసభ్యులు ధూళిపాళ్ళ నరేంద్ర కుమార్ పరామర్శించారు.

ఈ సందర్భంగా కన్నా లక్ష్మీనారాయణ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న ధూళిపాళ్ళ నరేంద్ర కుమార్ , శస్త్రచికిత్స అనంతరం వైద్యుల సూచనలు పాటిస్తూ పూర్తి విశ్రాంతి తీసుకోవాలని ఆకాంక్షించారు. ఆయన త్వరగా సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవాలని, ప్రజా సేవలో మరింత ఉత్సాహంతో కొనసాగాలని కోరుకున్నారు.

ఈ సందర్భంగా ఇరువురు నేతలు కొద్దిసేపు ఆత్మీయంగా మాట్లాడుకున్నారు. కన్నా లక్ష్మీనారాయణ త్వరగా సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవాలని ధూళిపాళ్ళ నరేంద్ర కుమార్ ఆకాంక్షించారు.

B RAJENDRA, GUNTUR TOWN

B RAJENDRA, GUNTUR TOWN