Guntur: పవన్ కళ్యాణ్ బర్త్‌డే వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే గళ్ళా మాధవి!

Guntur: గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు. మొక్కలు నాటి, విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే గళ్ళా మాధవి.

B RAJENDRA, GUNTUR TOWN
Published on: 3 Sept 2026 11:15 AM IST
Guntur
X

Guntur: పవన్ కళ్యాణ్ బర్త్‌డే వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే గళ్ళా మాధవి!

Guntur: ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలలో గుంటూరు పశ్చిమ నియోజకవర్గ పరిధిలో నిర్వహించిన పలు సేవా కార్యక్రమాల్లో ఎమ్మెల్యే గళ్ళా మాధవి పాల్గొన్నారు.

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదినాన్ని పురస్కరించుకుని శ్రీనివాసరావుపేటలో జనసేన పార్టీ అధికార ప్రతినిధి ఆళ్లహరి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే గళ్ళా మాధవి మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు.

అనంతరం మిర్చియార్డు డైరెక్టర్ కటకంశెట్టి విజయలక్ష్మి ఆధ్వర్యంలో బ్రాడిపేటలోని షిరిడి సాయి దీన జనసేవ సమితిలో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే గళ్ళా మాధవి విద్యార్థులకు పుస్తకాలు, పండ్లు పంపిణీ చేశారు. విద్యార్థులు విద్యతో పాటు మంచి విలువలను అలవరచుకుని ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. సమాజ అభివృద్ధిలో విద్య కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు.

B RAJENDRA, GUNTUR TOWN

B RAJENDRA, GUNTUR TOWN

Next Story