Guntur: తప్పు చేసిన వారికి శిక్ష తప్పదు.. ఎమ్మెల్యే గళ్ళా మాధవి

Guntur: గుంటూరు కృష్ణబాబు కాలనీలో మహిళపై జరిగిన అమానవీయ దాడి ఘటనపై పశ్చిమ ఎమ్మెల్యే గళ్ళా మాధవి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

B RAJENDRA, GUNTUR TOWN
Published on: 18 July 2026 11:40 AM IST
Guntur
X

Guntur: తప్పు చేసిన వారికి శిక్ష తప్పదు.. ఎమ్మెల్యే గళ్ళా మాధవి

Guntur: బాధితులు తనని కలసిన వెంటనే కేసు నమోదు చేసి, కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను సూచించినట్లు తెలిపిన ఎమ్మెల్యే గళ్ళా మాధవి అధికార పార్టీ లో ఉన్నాం మనం ఏం చేసినా చెల్లుతుందనే ఉద్దేశం, అహంకారం తో, గుంటూరు సిటీ లాలుపురం రోడ్డులోని కృష్ణబాబు కాలనీలో, టీడీపీ కి చెందిన మల్లెల మూర్తి అనే వ్యక్తి బోరు దగ్గర జరిగిన వివాదంలో, ఒంటిపులి పద్మ అనే మహిళ ని, హిజ్రా తో దాడి చేయించి, రోడ్డుపై ఆమెను రోడ్డుపై ( నోటితో చెప్పలేని విధంగా) వ్రాయలేని విధంగా, హిజ్రా చేయడమే కాకుండా ఒంటిపులి పద్మ ను ఇష్టం వచ్చినట్లు కాలితో ఎగిరెగిరి తన్నడంతో మహిళ సొమ్మసిల్లి పోయింది.

గుంటూరు పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని 21వ డివిజన్ కృష్ణబాబు కాలనీలో మహిళపై జరిగిన ఘటన తెలియడంతో గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యురాలు గళ్ళా మాధవి తీవ్ర ఆవేదనతో కూడిన ఆగ్రహం వ్యక్తం చేశారు.

మహిళల గౌరవం, భద్రతకు విఘాతం కలిగించే ఎలాంటి చర్యలనైనా సహించబోమని, తప్పు చేసిన వారికి శిక్ష తప్పదని ఎమ్మెల్యే గళ్ళా మాధవి స్పష్టం చేశారు. ఈ ఘటనకు సంబంధించిన బాధితులు గురువారం తనను కలిసి జరిగిన విషయాన్ని వివరించారని ఎమ్మెల్యే తెలిపారు.

విషయం తెలిసిన వెంటనే ఎలాంటి ఆలస్యం చేయకుండా నగరంపాలెం పోలీసులను సంప్రదించి నిందితుల పై కేసు నమోదు చేసి, కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు వెల్లడించారు. ఎమ్మెల్యే ఆదేశాల మేరకు పోలీసులు *మల్లెల మూర్తి మరియు హిజ్రా తో కలిపి మొత్తం 9మంది పై కేసు నమోదు చేయించారు.

సొంత పార్టీకి చెందిన స్థానిక నాయకుడు, త్వరలో కార్పొరేషన్ ఎన్నికలు వస్తున్నాయని కూడా ఎమ్మెల్యే మాధవి ఏమాత్రం ఆలోచించకుండా, తప్పు ఎవరూ చేసినా, తప్పు.. తప్పే అని ఆనాడు, అన్న సీనియర్ ఎన్టీఆర్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నో సందర్భాలలో అన్నారు.. నేడు గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే గల్లా మాధవి చేసి చూపి నిరూపించారు.

ఎన్డీయే ప్రభుత్వంలో మహిళల గౌరవానికి అత్యున్నత ప్రాధాన్యత ఉంటుందని, గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఇటువంటి అనాగరిక, అసాంఘిక చర్యలకు ఎట్టి పరిస్థితుల్లోనూ తావు లేదని గళ్ళా మాధవి స్పష్టం చేశారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని మహిళలను వేధించే వారిపై రాజీ లేకుండా ఎప్పుడూ ఈవిధంగానే వ్యవహరిస్తామని హెచ్చరించారు.

గతంలో మహిళలను ఇబ్బందులకు గురిచేసిన గంజాయి ముఠాలపై, విద్యార్థినులను వేధించిన వ్యక్తులపై కూడా కఠిన చర్యలు తీసుకున్నామని గుర్తు చేశారు. మహిళలకు అండగా మహిళా గ్రీవెన్స్ నిర్వహించి వారికి అండగా ఉన్నానని, మహిళల గౌరవాన్ని కించపరిచే చర్యలకు పాల్పడిన వారిని సమర్థించే ప్రశ్నే లేదని, ఇలాంటి దారుణాలకు పాల్పడిన వారిపై చట్టపరంగా అత్యంత కఠిన చర్యలు తీసుకునేలా చర్యలు కొనసాగుతాయని తెలిపారు.

ఈ ఘటనలో బాధిత కుటుంబాలకు తాను పూర్తిగా అండగా ఉంటానని ఎమ్మెల్యే గళ్ళా మాధవి భరోసా ఇచ్చారు. మహిళల భద్రత విషయంలో ఎవరైనా ఎంతటి వారైనా ఉపేక్షించబోమని, గుంటూరు పశ్చిమలో శాంతి భద్రతలకు భంగం కలిగించే వారిపై ఉక్కుపాదం మోపుతామని ఎమ్మెల్యే గళ్ళా మాధవి స్పష్టం చేశారు.

అదేవిధంగా ఈ ఘటనలో ఆరోపణలు ఎదుర్కొంటున్న *వ్యక్తిని పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ఎమ్మెల్యే గళ్ళా మాధవి ప్రకటించారు. పార్టీ క్రమశిక్షణ, మహిళల గౌరవం విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని, తప్పు చేసిన వారిని కాపాడే సంస్కృతి తెలుగుదేశం పార్టీకి లేదని ఎమ్మెల్యే గళ్ళా మాధవి తెలిపారు.

B RAJENDRA, GUNTUR TOWN

B RAJENDRA, GUNTUR TOWN

Next Story