Guntur: మీ ఓటుతో వైసీపీకి బుద్ధి చెప్పండి ఎమ్మెల్యే నసీర్!
Guntur: గుంటూరు తూర్పులో కూటమి అభ్యర్థుల ఎన్నికల ప్రచారం. రూ.400 కోట్లతో అభివృద్ధి చేశామని, కూటమి అభ్యర్థులను గెలిపించి వైసీపీకి బుద్ధి చెప్పాలని ఎమ్మెల్యే నసీర్ విజ్ఞప్తి.
Guntur: మీ ఓటుతో వైసీపీకి బుద్ధి చెప్పండి ఎమ్మెల్యే నసీర్!
గుంటూరు: స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి బలపరిచిన అభ్యర్థులకు ఓటు వేయడం గుంటూరు నగర అభివృద్ధికి బాటలు పరచడమేనని, మీ ఓటుతో వైసీపీకి బుద్ధి చెప్పాలని తూర్పు ఎమ్మెల్యే, అసెంబ్లీ మైనారిటీస్ కమిటీ చైర్మన్ నసీర్ అన్నారు. బుధవారం స్థానిక డివిజన్లలో 17_20, 21, 23 కార్పొరేటర్ అభ్యర్థులు షేక్ నయీముద్దీన్, సరస్వతి వెంకట కృష్ణంరాజు, పాలపర్తి సాయివనజ, బత్తుల ప్రసాద్ తో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ప్రతి డివిజన్ లోనూ ప్రజలు కూటమి నేతలకు బ్రహ్మరథం పట్టారు. రెండున్నరేళ్లలో అన్ని వర్గాలకు మేలు జరగడంతో అభివృద్ధిని కొనసాగించేందుకు కూటమి నేతలకు తాము మద్దతుగా నిలుస్తామని చెప్పారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నసీర్ మాట్లాడుతూ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగితే ఆర్థిక సంఘ నిధులు మంజూరవుతాయని, తద్వారా అభివృద్ధి సాధ్యమవుతుందని, దీనికి అడ్డుకునేందుకు గొడ్డలి కుయుక్తులు పన్నుతోందని ఎమ్మెల్యే నసీర్ మండిపడ్డారు.
రాష్ట్రంలో త్వరలో నూతన పింఛన్లు మంజూరు చేయబోతున్నారని, అర్హులైన ప్రతి ఒక్కరికీ అందించబోతున్నామని తెలిపారు. అర్హులైన ఏ ఒక్కరికైనా సంక్షేమ పథకాలు అందకపోతే వెంటనే తమ కార్యాలయాన్ని సంప్రదించవచ్చని, ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి సేవలందిస్తామని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమికి బలం చేకూర్చడం ద్వారా గుంటూరు నగరంలో మరింత అభివృద్ధి సాధించుకోవచ్చన్నారు.
గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఎన్నడూలేని విధంగా అన్ని రంగాల్లో ప్రగతి సాధించామని తెలిపారు. అభివృద్ధి, సంక్షేమానికి సుమారు రూ.,400 కోట్లు వెచ్చించామన్నారు. మురుగు శాశ్వత పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకున్నామని తెలిపారు. అంతర్గత రోడ్లను సైతం సీసీలుగా తీర్చిదిద్దుతున్నామని, గత వైసీపీలో గుంతల రోడ్లతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని చెప్పారు. కేవలం రోడ్లనే కాకుండా పార్కులు, క్రీడా ప్రాంగణాలు, వాకింగ్ ట్రాక్ నిర్మాణాలు చేపడుతున్నామని తెలిపారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వంలో రాష్ట్రానికి పరిశ్రమలు తరలివస్తున్నాయని, తద్వారా యువతకు ఉద్యోవకాశాలు పెరుగుతున్నాయని చెప్పారు. విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ ఆధ్వర్యంలో విద్యా సంస్కరణలకు నాంది పలికారని, గత పదో తరగతి ఫలితాల్లో స్పష్టంగా తెలిసిందన్నారు. నియోజకవర్గంలో నలుమూలలుగా అభివృద్ధికి పునాదులు వేశామని, దీనిని మరింత కొనసాగించాలంటే కూటమి బలపరిచిన అభ్యర్థులను గెలిపించుకుందామని పిలుపునిచ్చారు.




