Guntur: ఆపదలో ఉన్న పేదలకు చంద్రన్న సర్కార్ అండ: ఎమ్మెల్యే రామాంజనేయులు
Guntur: గుంటూరు ప్రత్తిపాడులో మెరుగైన వైద్యం కోసం ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా రూ. 1.28 లక్షల ఎల్‌ఓసీని లబ్ధిదారునికి ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు అందజేశారు.
Guntur: ఆపదలో ఉన్న పేదలకు చంద్రన్న సర్కార్ అండ: ఎమ్మెల్యే రామాంజనేయులు
Guntur: కష్టాల్లో ఉన్న పేదలను కూటమి ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని ప్రత్తిపాడు నియోజకవర్గ శాసనసభ్యులు డా.బూర్ల రామాంజనేయులు అన్నారు. గుంటూరు రూరల్ మండలం,వెంగళాయపాలెం గ్రామానికి చెందిన యర్రంశెట్టి నాగలక్ష్మి వైద్య చికిత్స నిమిత్తం రూ.1,28,000 విలువైన ఎల్‌ఓసీను ఈరోజు గుంటూరులోని క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే రామాంజనేయులు వారి కుటుంబ సభ్యులకు అందజేశారు.
ఈ సందర్భంగా శాసనసభ్యులు వారు మాట్లాడుతూ ఆర్థిక ఇబ్బందులతో వైద్యం చేయించుకోలేని పేద, మధ్యతరగతి కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తోందన్నారు. ముఖ్యమంత్రి సహాయనిధి, ఎల్‌ఓసీ ద్వారా అర్హులకు వైద్య సహాయం అందిస్తున్నట్లు తెలిపారు. ప్రజలకు అవసరమైన సమయంలో ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. పేదలకు అన్నివేళలా అండగా, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా సీఎం చంద్రబాబు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని ఎమ్మెల్యే రామాంజనేయులు స్పష్టం చేశారు..




